అవినాష్ ముందే మరో వ్యక్తికి ప్రపోజ్ చేసిన అరియానా.... షాక్ లో ఇంటి సభ్యులు..!

VAMSI
తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫోర్ దాదాపు చివరి అంకానికి చేరుకుంది... ఇప్పటికే పలువురు కంటెస్టెంట్ లు ఎలిమినేట్ కాగా చివరికి.. అభిజిత్, లాస్య, అవినాష్, అరియానా, సోహెల్, అఖిల్, హారిక మరియు మోనాల్ లు మిగిలారు... ఇక ఇప్పుడు టాప్ ఫైవ్ లో ఎవరు ఉంటారు అన్న చర్చ బిగ్ బాస్ ఇంటిలో మొదలైంది. ఎవరికి వారు తాము టాప్ ఫైవ్ లో ఉంటాము అని ప్రశ్నించుకుంటూ కొన్ని సందర్భాల్లో ఇతర కంటెస్టెంట్ ల అభిప్రాయాలను అడుగుతున్నారు. ప్రతి ఒక్కరూ పోటాపోటీగా టాస్క్ లో పాల్గొంటూ గట్టి పోటీ ఇస్తున్నారు...

ఇలా కొనసాగుతుండగా 74 వ రోజు కంటెస్టెంట్ ల ఇంటి సభ్యులు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.... ఒక్కొక్కరిగా వస్తూ వారి కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడారు. ఈ నేపథ్యంలో వినయ్ హౌస్‌లోకి ప్రవేశించాడు. వినయ్‌ను చూడగానే అరియానా టాస్క్‌ను కూడా వదిలేసి పరుగెత్తుకెంటూ వెళ్లింది. వినయ్.. అరియానా కోసం హౌస్ లోకి వెళ్లగా..... వినయ్ అంటూ ఎంతో ప్రేమతో అతని వద్దకు వచ్చింది. అద్దం మధ్యలో ఉండగా వినయ్ ని చూస్తూ భావోద్వేగానికి లోనై కంట తడి పెట్టింది..అరియానా ఎమోషనల్ అయ్యి.... వినయ్ ఐ లవ్ యూ అంటూ ఇంటి సభ్యుల ముందు ఓపెన్ అయిపోయింది...

ఒకరకంగా ఇది అవినాష్ కు షాకింగ్ న్యూస్ అయినా అరియానా నాకు మంచి స్నేహితురాలు అంటూ సైలెంట్ అయిపోయాడు... ఇక మోనాల్ అక్క వచ్చి ఏదైనా ఉంటే బయటికి మాట్లాడండి అంటూ... అభిజిత్ కు చిన్న వార్నింగ్ ఇచ్చినట్లు అనిపించింది... సోహెల్ వాళ్ళ నాన్నను బిగ్ బాస్ ఇంటి లో చూసి సందడి చేశాడు.. అలా గురువారం ఎపిసోడ్ ముగిసింది. మరి ఈ వరం ఎలిమినేషన్ మరింత రసవత్తరంగా సాగనుంది. ఎవరు ఎలిమినేట్ కానున్నారో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: