ఆ 'షో'కి చీఫ్ గెస్ట్ గా వచ్చి ఇబ్బందులు పడ్డ పవన్ కళ్యాణ్ భక్తుడు 'బండ్ల గణేష్'!

SS Marvels
కమెడియన్ గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్ తో 'గబ్బర్ సింగ్' లాంటి బ్లాక్ బస్టర్ సినిమా రూపొందించి ఇక ఆ తర్వాత బండ్ల గణేష్ కాస్త బ్లాక్ బస్టర్ గణేష్ గా మారిన సంగతి తెలిసిందే. ఇక జీ తెలుగు ఛానల్ నిర్వహిస్తున్న ‘బొమ్మ అదిరింది’ షోలో గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు పవన్ భక్తుడు, ప్రముఖ కమెడియన్ కమ్ నిర్మాత బండ్ల గణేష్. మెగా బ్రదర్ నాగబాబు జడ్జీగా వ్యవహరిస్తున్న ‘బొమ్మ అదిరింది’ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్‌గా వచ్చి ఆకట్టుకున్న బండ్ల గణేష్ ఎపిసోడ్ ఈ ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారం కాబోతుంది. ఇక ఇప్పుడు ఈ ‘బొమ్మ అదిరింది’ ఎపిసోడ్ ప్రోమో యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది.

గబ్బర్ సింగ్ చిత్రంలోని టైటిల్ సాంగ్‌తో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్.. పవర్ కళ్యాణ్ సిగ్నేచర్ స్టెప్ వేస్తూ అలరించాడు. ఇతనికి శ్రీముఖి, జానీ మాస్టర్ కూడా తోడు కలిశాడు. హార్ట్లీ వెల్కమ్ బండ్ల గణేష్ గారూ.. ఎలా ఉన్నారని శ్రీముఖి అడగడంతో ‘బ్లాక్ బస్టర్’ అంటూ పంచ్ డైలాగ్‌తో హంగామా మొదలుపెట్టారు. ఇక జడ్జీ నాగబాబు ‘ఇదేంటో తెలుసారా? అంటూ బ్లేడ్ తీసి చూపించారు. అది 7'0 cLOCK బ్లేడ్ అయితే కాదు అంటూ తన మీద తానే పంచ్ వేసుకున్నాడు బండ్ల. ఇక గల్లీ బాయ్స్ టీం లీడర్ సద్దాం.. బండ్ల గణేష్‌ను ఓ ఆట ఆడుకున్నాడు. బండ్ల గణేష్ 7'0 cLOCK బ్లేడ్‌ని ఫుల్‌గా వాడేశాడు. ఈ స్కిట్‌లో బండ్ల గణేష్‌ పాత్రలో కనిపించాడు సద్దాం. ‘సార్ బొమ్మ అదిరింది షో నుంచి మాట్లాడుతున్నాం.. మీరు మా షోకి గెస్ట్‌గా రావాలి సార్’ అని ఫోన్ రాగా.. టైం చెప్పండి అని అనడం.. ఫోన్‌లోని వ్యక్తి 7'0 CLOCK అని చెప్పడంతో.. ఏయ్ నేను రాను పో అని సద్దాం అనడం నవ్వులు పూయించింది.

ఇక సెలూన్ షాప్‌కి వెళ్లి గడ్డం ఎక్కువైంది షేవింగ్ చేయి చెప్పడం.. బార్బర్ బ్లేడ్ తీసి షేవ్ చేస్తుండగా.. నాకు బ్లేడ్‌తో గెడ్డం చేయొద్దు గొడ్డలితో చేయి అని అనడంతో బండ్ల గణేష్‌తో పాటు నాగబాబు, జానీ మాస్టర్‌లు పడి పడి నవ్వుకున్నారు. ‘మిరపకాయ తింటే కారం.. నాగబాబు అంటే మమకారం.. ఆయన ఒక శిఖరం.. ఆయన్ని కలవడానికి ఒక ఎకరం అమ్మా.. నా పిల్లలు నన్ను అడిగారు.. ఎత్తుకు ఎదగడం అంటే ఏంటి నాన్నా అని.. నేను నాగబాబు గారి ఫొటో చూపించా..’ అంటూ బండ్ల గణేష్‌ను ఇమిటేట్ చేస్తూ సెటైర్లు వేశాడు సద్దాం. ఈవిధంగా మొత్తానికి బొమ్మ అదిరింది షోకి వచ్చిన బండ్ల గణేష్‌ని నాగబాబుతో సహా అందరూ ఫుల్‌గా వాడేశారు. వాళ్ల పంచ్‌లకు ఏడ్వలేక నవ్వు అన్నట్టుగా పాపం బండ్ల గణేష్ నవ్వుతూనే ఉండిపోయారు. మొత్తంగా ఈ ప్రోమోలో బండ్ల గణేష్‌ గెస్ట్‌గా వచ్చినప్పటికీ అతనిపై ఒక రేంజ్ లో సెటైర్స్ వేశారు టీం అంతా... బండ్ల గణేష్ కూడా ఆ సెటైర్స్ ని ఎంజాయ్ చేయటంతో ప్రోగ్రాం విజయవంతంగా ముగిసింది.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: