దేత్తడి హరికను వదలనన్న ఆమె సోదరుడు.. !!

Suma Kallamadi
బుల్లితెర ప్రేక్షకులను టీవీ దగ్గర నుండి లేవకుండా చేస్తున్న షో ఏదన్నా ఉంది అంటే అది మా టీవీ లో ప్రసారమయ్యే బిగ్ బాస్ షో అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికే బిగ్ బాస్ షో 3 సీజన్స్ ను పూర్తిచేసుకుని నాల్గవ సీజన్ కూడా విజయవంతంగా రన్ చేస్తుంది అంటే ప్రేక్షకులు ఎంతగా బిగ్ బాస్ షోను ఆదరిస్తున్నారో  ప్రేత్యేకంగా చెప్పనవసరం లేదు. బిగ్ బాస్ హౌస్ లో సభ్యులు కూడా తమ దైన శైలిలో ఎవరి పెర్ఫార్మన్స్ వారు చేస్తున్నారు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఒక సభ్యురాలి సోదరుడు పెట్టిన పోస్ట్ చర్చనీయాంశం అయింది. ఇక ఆ సభ్యురాలు ఎవరంటే అలేఖ్య హారిక...ఏంటి ఈ పేరు ఎక్కడా విన్నట్లు కూడా అనిపించడం లేదా..??

చాలామందికి అలేఖ్య హారిక అంటే ఎవరో కూడా తెలియదు.అదే దేత్తడి హారిక అంటే మాత్రం చాలా మంది ఇట్టే గుర్తు పట్టేస్తుంటారు. దేత్తడి పోరి సోషల్ మీడియాలో భలే యాక్టీవ్ గా ఉంటుంది. నటనలో గాని,  డైలాగ్ చెప్పడంలో గాని అసలు తడబాటు ఉండదు. సమాజంలో హాట్ టాపిక్ అవుతోన్న ఎన్నో అంశాలపై వీడియోలు రూపొందించి.. భారీ స్థాయిలో క్రేజ్‌ను సంపాదించుకుంది హారిక. ఈ గుర్తింపుతోనే బిగ్ బాస్ సీజన్ - 4 లో నటించే అవకాశాన్ని అందుకుంది. హౌస్‌లోకి అడుగు పెట్టినప్పటికీ నుండి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌తో ప్రేక్షకుల దృష్టిలో పడిపోయింది.అలాగే బిగ్ బాస్ హౌస్ లో ఓ రోజు మార్నింగ్ మస్తీలో భాగంగా పొట్టి దుస్తులు ధరించి హాట్ డ్యాన్స్ చేసింది. ఇక, ఆరోజు నుంచి హారిక బాగా ఫేమస్ అయింది. చాలామంది అభిమానులను సంపాదించుకుంది.అయితే తాజాగా జరిగిన ఎపిసోడ్ లో హారిక తన టీమ్ ను గెలిపించాలని,  బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే హారిక చేసిన ఈ పని పట్ల ఆమె సోదరుడు షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు. ఇకపై హారికను వదలిపెట్టేది లేదంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇంతకీ హారిక ఏమి చేసిందటె బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ మేరకు హారిక తన జుట్టును మెడ పై వరకు కత్తిరించుకోవడంతో పాటు ఎరుపు రంగును  కూడా వేసుకుంది. అయితే జుట్టు కత్తిరించుకునే అప్పుడు హారిక చాలా భావోద్వేగానికి లోనయ్యి కన్నీరు పెట్టుకుంది కూడా.

ఎందుకంటే హారిక హౌస్ లోకి రాకముందు వాళ్ళ అన్నకు ఎట్టి పరిస్థితులలోను జుట్టు తియ్యడం లాంటివి చేయను అని చెప్పింది అంట. కానీ సోదరుడికి ఇష్టం లేని పని చేస్తున్న కారణంగా అన్నకి సారీ చెబుతూ టాస్క్ కంప్లీట్ చేసింది.ఈ విషయం మీద ఆమె సోదరుడు వంశీ కార్తీక్ సోషల్ మీడియా ద్వారా ఒక మెసేజ్ ని పోస్ట్ చేసాడు. ‘నువ్వు హౌస్‌లో ఉన్నవాళ్లలో ఒక  స్ట్రాంగ్ కంటెస్టెంట్. నువ్వు జుట్టు  కత్తిరించుకోవడంపై కోపం లేదు. కానీ, నిన్ను టీజ్ చేయడానికి నాకో అవకాశం వచ్చింది. ఇకపై నిన్ను వదలను బుజ్జితల్లి' అంటూ పోస్ట్ చేశాడు.చెల్లెలు తనకు ఇష్టం లేని పని చేసినాగాని సోదరి ఉన్న పరిస్థితిని అర్ధం చేసుకుని తనకు సపోర్ట్ గా నిలిచిన వంశీ కార్తీక్ ను అందరు మెచ్చుకుంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: