బిగ్ బాస్ కంటెస్టెంట్ లకు నాగ్ వార్నింగ్...?

VAMSI
కరోనా వలన ఆలస్యంగా ఆరంభమయిన బిగ్ బాస్ సీజన్ 4 తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. బిగ్ బాస్ సీజన్ 4 ఒక వారం ఒకలా మరో వారం ఇంకోలా సాగుతోంది. రోజు రోజుకీ సరికొత్త గేములతో బిగ్ బాస్ కంటెస్టెంటులకు పరీక్షపెడుతూ అంతులేని వినోదాన్ని పంచిపెడుతూ ఉంది ఈ బిగ్ బాస్. నిన్నటి ఎపిసోడుకి విచ్చేసిన మన్మధుడు నాగార్జున ముందుగా ఈవారంలో ఏంజరిగిందో అందరికీ వివరించారు.

ఈ వారం ఇంటి సభ్యుల వింత ప్రవర్తన గురించి ప్రేక్షకులకు తెలియచేసారు . గతవారం కంటే ఈ వారం ఇంటి సభ్యుల ప్రవర్తనలో చాలా తేడా కనిపించింది.  అవినాష్ అద్దంగా మారి చేసిన కామెడీ అయితే ఈ వారానికే హైలైట్ అని చెప్పొచ్చు.  బిగ్ బాస్ హౌస్ లో కొంతమంది సభ్యులు అవినాష్ కామెడీని ఎంజాయ్ చేయగా, మరికొద్దిమంది మాత్రం దీనిని పాజిటివ్ గా తీసుకోకుండా విసుక్కున్నారు. నానా రభస చేసారు. ఇందులో సుజాతకు  అవినాష్ కామెడీ నచ్చలేదు. ఇక పోతే దివి అయితే ఎవరితోనూ కలవడం లేదు. అభిజిత్ మరియు హరిక ల మధ్య చిన్నపాటి గొడవతో దూరం పెరిగినట్టు కనిపించినా చివరి నిమిషంలో మళ్ళీ ఒకటయ్యారు.

కాయిన్స్ టాస్క్ లో గంగవ్వ  ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు. అంతేకాకుండా ఇంతకుముందులాగా  అమ్మ రాజశేఖర్ కామెడీ చేయడం లేదు.. ప్రతి విషయానికి సీరియస్ అవుతున్నారు. అతని కాయిన్స్ తో పాటు మిగతావారి కాయిన్స్ ని రాత్రంతా మేల్కొని సోహైల్ కొట్టేశాడు. కానీ అవి తన వద్ద వుంచుకోకుండా మెహబూబ్ ని కెప్టెన్ ని చేయాలని తను కొట్టేసిన కాయిన్స్ ని అతనికి ఇచ్చేయడం.. చివరికి ఊహించని కుమార్ సాయి కెప్టెన్ కావడం వంటి మార్పులు చోటు చేసుకున్నాయి.

ప్రతి వారంలాగే ఈ వారం కూడా ఎలిమినేషన్ వుండటంతో ఇంటి సభ్యుల ప్రవర్తనపై నాగార్జున ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హౌస్ లోకి మీరు వెళ్ళింది ఆట ఆడడానికే..కాబట్టి ఎవరి ఆట వారు ఆడండి.  అలాకాకుండా పక్కవారికి ఎక్కువ సపోర్ట్ చేసి ఆడకూడదు.  ఇంకోసారి ఇలా జరిగిందంటే కథ వేరే వుంటది అంటూ ఇంటి సభ్యులకు తనదైన  స్టయిల్ల్లో వార్నింగ్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: