దొరబాబు గతాన్ని కూడా వదిలపెట్టని హైపర్ ఆది..!
ఇక దొరికితే వదలరు అంటూ.. 2020లో విపత్తులు మొదలైందే వీరిద్దరితో, వీళ్లు దొరికితే వదిలించడానికి నానా.. అంటూ గ్యాప్ ఇచ్చారు. అయితే పొరబాటున ఐమాక్స్ అనుకుని వెళితే అక్కడ వర్మ క్లైమాక్స్ ఉందని కౌంటర్ వేశాడు. మరో స్కిట్లో ఇది స్వయం వరమేనా? దొరబాబు వచ్చాడు కదా వేరే కార్యక్రమం అనుకున్నానని పంచ్ వేస్తున్నాడు. 103 డిగ్రీల టెంపరేచర్ పెరుగుతోందని దొరబాబు అంటే.. పోలీసులు థర్డ్ డిగ్రీ ఇచ్చిన తరువాత కూడానా అని ఆది సెటైర్స్ వేశారు.
అంతేకాకుండా వచ్చేవారం రాబోయే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదలు చేశారు. అందులో దొరబాబుపై వేసిన సెటైర్స్ బాగా పేలాయి. స్కిట్లో భాగంగా దొరబాబు సాంబార్ వండాడు. దాని టేస్ట్ చూడమని ఆదికి ఇస్తే.. అక్కడ ఇది కూడా నేర్పించారా? అంటూ సెటైర్ వేసేశాడు. ఇలా ప్రతీ సారి ఏదో ఒక పంచ్ వేయడంతో ఆ గతం మళ్లీ మళ్లీ గుర్తుకు వస్తూనే ఉందన్నారు. గత వారంలో దొరబాబు భార్యను కూడా ఎంట్రీ చేయించారు. భార్య ముందే దొరబాబు పరువుదీసేశాడు ఆది. పంచ్‌ల వర్షం కురిపించడానికి ఇలా వారి జీవితంలో జరిగిన సంఘటనలను వాడుకుంటున్నాడు ఆది. అయితే ఆ పంచ్‌లు బాగా క్లిక్ అవుతుండటంతో బాగానే కంటిన్యూ చేస్తున్నారు.