తన ప్రేయసిని పరిచయం చేసిన యాదమ్మ రాజు...!

Suma Kallamadi
ఈటీవీ ప్లస్ ఛానల్ లో ప్రసారమయ్యే పటాస్ కామెడీ షోతో బాగా పాపులర్ పొందిన కమెడియన్ యాదమ్మ రాజు, తాజాగా జీ తెలుగులో ప్రసారం కాబోనున్న ' బాబు బొమ్మకు పెళ్ళంట ' అనే ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలో తన నిజ జీవితంలో ప్రియురాలిని పరిచయం చేశాడు. ఈ నెల 22న రాబోతున్న ఈ కార్యక్రమం సంబంధించి ప్రోమోను ఇటీవల విడుదల చేయగా అందులో యాదమ్మ రాజు తన నిజ జీవితం లోని ప్రియురాలి వివరాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు.


అయితే ఈ షోలో ప్రదీప్ మాచినేని యాంకరింగ్ చేస్తుండగా.. యాదమ్మ రాజు ను స్టేజి మీదికి పీల్చుకొని వచ్చి ముందుగా నీకు గర్ల్ ఫ్రెండ్ వుందా అని అడిగాడు. అందుకు యాదమ్మ రాజు నాకు అటువంటి వారు ఎవరూ లేరు, నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు అన్న అని సమాధానం ఇవ్వబోతున్న సమయంలో వెనుకనుంచి ఓ అమ్మాయి ప్రత్యక్షమైంది. ఆ అమ్మాయి ఎవరో కాదు యాదమ్మ రాజు నిజజీవితంలోని ప్రియురాలు. ఆ తర్వాత యాదమ్మ రాజు అమ్మాయిని చూసి తెగ సిగ్గు పడుతూ ఆనందంతో పొంగిపోయాడు. ఆ తదుపరి జడ్జీగా ఉన్న నాగబాబు యాదమ్మ రాజు ఆ అమ్మాయి ఎవరు అని అడిగా, వెంటనే నా పోరి అన్న అంటూ అసలు నిజం అని చెప్పాడు. అంతే కాదు ఆ అమ్మాయికి డీటెయిల్స్ కూడా టక్కున చెప్పేశాడు.


అమ్మాయి పేరు శార్లి స్టెల్లా అని, అమ్మాయి వయసు 22 సంవత్సరాలు అని చెప్పేసాడు. ఆపై అమ్మాయికి చేతికి ఏదో అయింది ఒకసారి చూడు అని అనగా... తన ప్రేయసికి చేతికి ఉన్న కట్టును విప్పి చూశాడు. అలా చూసినా యాదమ్మ రాజు ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. దానికి కారణం ఆ అమ్మాయి తన చేతిపై యాదమ్మ రాజు పచ్చబొట్టును వేయించుకుంది. దీంతో ఎమోషనల్ గా అతను ఫీల్ అయ్యి వెంటనే ఆ అమ్మాయిని పైకెత్తి తిప్పేశాడు. ఇప్పుడు ఈ వీడియో బుల్లితెర అభిమానులకు బాగా కనెక్ట్ అయింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: