సాయి కుమార్ సమక్షంలో హైపర్ ఆది కామెడీ పెళ్లి...!

Suma Kallamadi
తెలుగు టెలివిజన్ లో నవ్వులు పూయించే కార్యక్రమం ఏదంటే ఠక్కున సమాధానం ఇచ్చే కార్యక్రమం పేరు జబర్దస్త్. ఇక జబర్దస్త్ లో కూడా కేవలం కొన్ని టీములు మాత్రమే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి అందరికి విదితమే. హైపర్ ఆది, సుడిగాలి సుదీర్ టీమ్స్ కు అత్యధిక అభిమానులు ఉన్నారు. ఇక హైపర్ ఆది విషయానికి వస్తే బుల్లెట్ల వర్షంలాగా తన పనులను బుల్లితెరలో అభిమానులకు పంచుకున్నాడు. కేవలం బుల్లితెర అని కాకుండా వెండితెరపై కూడా తన పర్ఫామెన్స్ చేశాడు.



కేవలం జబర్దస్త్ లో మాత్రమే కాకుండా డి  కార్యక్రమంలో కూడా హైపర్ ఆది తనదైన శైలిలో పంచులు వేస్తూ ఉంటాడు. ప్రస్తుతం హైపర్ ఆది జబర్దస్త్ షో లతో బిజీబిజీగా గడిపేస్తున్నారు. వచ్చీ రాని డాన్స్ మూమెంట్ వేసి అందరినీ నవ్విస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే డి కార్యక్రమం మాత్రం కాస్త రొమాంటిక్ యాంగిల్ ను బాగా వాడుతున్నాడు అర్థమవుతుంది. ఇక డి కార్యక్రమంలో హైపర్ ఆది ఎంట్రీ ఇచ్చాక మొత్తం పరిస్థితి మారిపోయింది అక్కడ. యాంకర్ వర్షినితో రాసుకుపూసుకు తిరుగుతున్నట్లు గుసగుసలు వినపడుతున్నాయి. దీంతో వీరిద్దరి రొమాన్స్ కాస్త బుల్లితెర లో బాగా క్లిక్ అయింది. అయితే ఈ మధ్యకాలంలో వీరిద్దరి పెళ్లి జరుగుతున్నట్లు పుకార్లు వచ్చాయి.



అయితే తాజాగా సాయికుమార్ హోస్ట్ గా నిర్వహించే వావ్ ప్రోగ్రాం లో తాజాగా హైపర్ ఆది, రోహిణి, హిమజలను షో ఆడేందుకు పిలిచారు. అయితే ఈ కార్యక్రమంలో హైపర్ ఆది అందరి మీద ఓ రేంజ్ లో పంచులు వర్షం కురిపించాడు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో హైపర్ ఆది తో పాటు పాడిన రోహిణి, హిమజ  ఓ రేంజ్లో ఆడుకున్నాడు. అయితే ఈ కార్యక్రమంలో హైపర్ ఆది చేసిన కామెంట్స్ కాస్త వైరల్గా మారాయి. ఈ కార్యక్రమంలో భాగంగా సాయికుమార్ హైపర్ ఆది అల్లరి ని చూసి ఏమయ్యా మీ ఇంట్లో వాళ్లు మంచిగా పెళ్లి చేద్దామని చూస్తుంటే నువ్వేనయ్యా ఇలా చేస్తున్నావ్ అని అనడంతో... ఏదో తొందరలో పొరపాటు అన్నట్లు హైపర్ ఆది సెటైర్ వేశాడు. అయితే కార్యక్రమం చివర్లో సాయి కుమార్ కు హైపర్ ఆది థ్యాంక్స్ పెళ్లి చేయడంతో పాటు అగర్బత్తి కూడా ఇస్తున్నాడని చివర్లో ఇచ్చే గిఫ్ట్ లను ఉద్దేశించి ఆది పంచ్ వేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: