బిగ్ బాస్ 4 కోసం మొదలైన ప్రోమో షూటింగ్...!?
అయితే లాక్ డౌన్ మొదలు కాకముందే బిగ్ బాస్ వార్తలు సోషల్ మీడియాలో భాగ వచ్చాయి. ఇదిగో అదిగో అంటూ రేపోమాపో ప్రారంభం అవుతుంది అంటూ బిగ్ బాస్ పై అనేక అంచనాలను పెంచారు అప్పట్లో. కానీ ఇవేవీ జరగలేదు. అయితే తాజాగా కొన్ని రోజుల నుండి బిగ్ బాస్ వార్తలు మళ్లీ ఊపందుకున్నాయి. అందుకు తగ్గట్టే మా ఛానల్ ఇప్పటికే బిగ్ బాస్ సంబంధించి ప్రోమోని కూడా వదిలింది. ఇక ప్రోమో వచ్చిందో లేదో కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే అంటూ అనేక మంది అనేక రకాల లిస్టులను విడుదల చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు కొందరు. ఈ క్రమంలోనే హోస్ట్ గా నాగార్జున కూడా షూటింగ్ లలో పాల్గొన్నాడని వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి తాజాగా ప్రోమో షూట్ చేయడం కోసం అన్నపూర్ణ స్టూడియోలో వేసిన బిగ్ బాస్ సెట్ ను వినియోగించుకుంటున్నారని సమాచారం. ఇందుకు సంబంధించి రాజమౌళి ఆస్థాన కెమెరామన్ కేకే సింథల్ ను రంగంలోకి దించుతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆయన కెమెరా బాధ్యత వహించనుండగా హోస్ట్ గా నాగార్జున చేసే యాక్టింగ్ తో ప్రోమో అదిరిపోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో భాగంగా బిగ్ బాస్ ను అత్యంత కఠిన నిర్ణయాలు మధ్య, అలాగే మరింత జాగ్రత్తగా చర్యల నడుమ తీసుకోవాలని యాజమాన్యం నిర్ణయించుకుంది. ఇందుకోసం కంటెస్టెంట్ లకు కరోనా పరీక్షలు నిర్వహించిన తర్వాతనే, ఆ తర్వాత క్వారంటైన్ లో ఉంచి ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి పంపుతారని సమాచారం. ఇందుకోసం హోస్ట్ నాగార్జున కూడా మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.