హిట్లర్ గారి పెళ్లాం’ ఈవిడే.. అదిరిపోలే ..!

Suma Kallamadi

బుల్లితెరపై కోట్లాది మంది అభిమానుల మది గెల్చుకున్న నటుడు నిరుపమ్. ఒక్కవైపు హీరోలా కనిపిస్తూనే, మరోవైపు ప్రొడక్షన్ కూడా మొదలు పెట్టారు. అయితే బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు అద్భుతమైన కాన్సెప్ట్‌తో.. కొత్త స్టోరీ లైన్‌తో ‘హిట్లర్ గారి పెళ్లాం’ అనే కొత్త సీరియల్ తీసుకొస్తోంది జీ తెలుగు ఛానల్. ఈ సీరియల్ కి సంబంధించి ప్రోమోల మీద ప్రోమోలని రిలీజ్ చేస్తోంది. 

 

 

అయితే హిట్లర్ గారి పెళ్లాం మొదటి ప్రోమోలో హిట్లర్‌గా నిరుపమ్ పరిటాల.. మెలేసిన మీసాలతో సూటూ, బూటూ వేసి స్టైలిష్ లుక్‌లో వారెవ్వా అనిపించిన సంగతి తెలిసిందే. అంత లగ్జరీ కార్‌లో ఎంట్రీ ఇచ్చిన నిరుపమ్‌ని చూసి ‘సూపర్’ అంటూ అభిమానులు ఆహ్వానాలు పలికారు. అంతేకాదు గత ప్రోమోలో హిట్లర్‌ గారి పెళ్లాన్ని సస్పెన్స్‌గా ఉంచారు ఈ సీరియల్ టీం మెంబెర్స్. తాజగా ఆ అందాల బొద్దుగుమ్మని చూపిస్తూ.. అదిరిపోయే స్టోరీ కాన్సెప్ట్ కూడా రివీల్ చేశారు.

 

 

అయితే ఈ సీరియల్ లో హీరోయిన్ స్టోరీ కూడా చాల స్ట్రాంగ్ అనే చెప్పవచ్చు. ప్రతి దానికి హీరోయిన్ భాను.. నీ వల్ల కాదు అంటే ఛాలెంజ్‌గా తీసుకుంటుంది. కానీ ప్రతి దానిలోనూ ఫెయిల్ అవుతుంది. అయితే పెళ్లి చూపులకు వచ్చిన ముగ్గురు మహిళలు.. భానుని చూసి.. బాగుందని డిసైడ్ అయ్యి... ‘మా ముగ్గురికి అత్తగా మా ఇంటికి వస్తావా?’ అని అడగడంతో భాను బిత్తరపోయి చూస్తుంది. 

 

 

కోడలిగా అడుగుపెట్టాల్సిన వయసులో అత్తగానా?’ అని షాక్ అవుతుంది. ఈవిడేనండీ మన ‘హిట్లర్ గారి పెళ్లాం’ అంటూ ఉన్న ఈ ప్రోమో చూస్తుంటే భలే కామెడీ ఉంది. హీరోయిన్ భాను.. అసలు పేరు గోమతి ప్రియ. ఈమె తమిళ సీరియల్స్‌లో నటించి.. తెలుగులో ‘హిట్లర్ గారి పెళ్లాం’ సీరియల్‌తోనే ఆరంగ్రేట్రం చేస్తోందన్నారు. ఈ ప్రోమోను చుసిన  అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: