బుల్లితెర: ఆట కావాలా పాట కావాలా షో గుర్తుందా?

Durga Writes

జెమినీ టీవీ.. ఇప్పుడు ఎన్నో అర్ధం లేని ఛానెల్స్ రావడం కారణంగా వెనుకబడింది కానీ.. లేకుంటే ఈ జెమినీ టీవీ ఏ రేంజ్ లో ఉండేది అసలు. ఎన్నో అద్భుతమైన ప్రోగ్రామ్స్ ని, సీరియల్స్ ని, బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన ఛానెల్ జెమినీ టీవీ. ఏళ్ళు గడుస్తున్నా ఈ ఛానెల్ సీరియల్స్ ని మర్చిపోలేకపోతున్నాం మరి. అంత మంచి కంటెంట్ వచ్చేది జెమిని టీవీలో. 

 

అయితే ఇప్పుడు ఎన్నో లైవ్ షోస్ వస్తున్నాయ్.. ఇంకా ఆ షోస్ అంత సోది తప్ప ఎం ఉండేది.. చూడగానే విడి అవతారం ఏంటి అని పక్కకి తిప్పేస్తాం. కానీ అప్పట్లో ఎంతో కాలం నడిచిన అద్భుతమైన షో ఒకటి ఉంది. అదే ఆట కావాలా.. పాట కావాలా షో. ఈ షో లో యాంకర్ అనుపమ ఎంతో నీట్ గా సుత్తి లేకుండా ఈ షో ని అద్భుతంగా హోస్ట్ చేశారు. 

 

అయితే ఈ షో కేవలం శని, ఆదివారంలో మాత్రమే సాయింత్ర 4 గంటలకు వచ్చేది. ఇంకా ఈ షో కూడా ఎంతో డిఫరెంట్ ఉండేది. అప్పట్లోనే మంచి మంచి ఎడిటింగ్ లు చేసి షోను అద్భుతంగా చేశారు. ఇంకా ఈ షోలో అనుపమతో మాట్లాడేందుకు ఎంతోమంది ప్రయత్నించేవారు.. అయితే ఒకరితో మాట్లాడేవారు. ఇంకా ఆట అంటే సినిమాలో మంచి సిన్.. కావాలా? పాట కావాలో చెప్పాలి. 

 

అయితే నిజానికి ఇప్పుడు అంటే చేతిలో స్మార్ట్ ఫోన్.. అందులో యూట్యూబ్ ఉన్నాయి. కానీ అప్పట్లో అదేం లేవు కదా! అందుకే ఈ షో హిట్ అయ్యింది. ఇంకా ఇది అంత పక్కన పెట్టి షో లోకి వెళ్తే.. మూడు ప్రశ్నలు వేసేవారు.. మూడు ప్రశ్నలు కరెక్ట్ గా ఒక గిఫ్ట్ కూడా ఇచ్చేవాళ్ళు. అయితే ప్రశ్నలు మాత్రం యాంకర్ లాగే చాలా బాగుండేవి. 

 

ఇకపోతే.. ఇప్పుడు కొత్త సినిమాల కోసం సోషల్ మీడియాను ఎలా వాడుకుంటున్నారో.. అలానే అప్పట్లో ఈ షో ను బాగా వాడేవారు. కొత్త సినిమా ప్రేమోషన్స్ కు అందరూ వచ్చేవారు. లైవ్ లో డైరెక్ట్ ప్రేక్షకులతో మాట్లాడేవారు. అలా ఈ షో బాగా హిట్ అయ్యింది. ఇంకా ఈ షో ద్వారా యాంకర్ అనుపమకు మంచి క్రేజ్ వచ్చింది. ఇప్పటికి కూడా అక్కడక్కడా తళుక్కుమని మెరుస్తుంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: