TRAI: స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టాలంటే..?

ఇక ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ కూడా కచ్చితంగా స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు. కేవలం కాల్స్ కోసమే కాకుండా ఇతర అవసరాలకు కూడా స్మార్ట్ ఫోన్ వాడకం బాగా పెరగింది. ఇంకా అలాగే వ్యాపార అభివృద్ధికి, ఆఫర్లు తెలియజేయడానికి కంపెనీలు కూడా స్మార్ట్ ఫోన్స్‌నే సాధనంగా వాడుకుంటున్నాయి.అయితే స్పామ్ కాల్స్ బెడద అనేది చాలా ఎక్కువగా ఉంటుంది.అందుకే ఈ స్పామ్ కాల్‌లను శాశ్వతంగా బ్లాక్ చేయడానికి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ప్రత్యేక సర్వీసెస్ ని ప్రారంభించింది. స్పామ్ కాల్స్‌ను బ్లాక్ చేయడంలో వ్యక్తులకు సహాయపడటానికి ట్రాయ్ నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (ఎన్‌సీపీఆర్)ను స్టార్ట్ చేసింది.ఇక ఈ సింపుల్ స్టెప్స్‌తో డీఎన్‌డీ యాక్టివేషన్ ఇలా చేయవచ్చు..మన స్మార్ట్ ఫోన్ నుంచి స్టార్ట్ అని టైప్ చేసి 1909కు మెసేజ్ పంపాలి.అప్పుడు మీకు అక్కడ కేటగిరీల జాబితా అనేది వస్తుంది. తరువాత మీరు బ్లాక్ చేయాలనుకుంటున్న వాటి కోడ్‌ను రిప్లై ఇవ్వాలి. రియల్ ఎస్టేట్, విద్య ఇంకా అలాగే ఆరోగ్యం మొదలైన నిర్దిష్ట వర్గం నుంచి కాల్‌లను నియంత్రించడానికి మీరు ఎంచుకోగల కొన్ని కోడ్‌లనేవి ఇక్కడ ఉన్నాయి.


ఆ తర్వాత అన్ని వర్గాలను కూడా పూర్తిగా బ్లాక్ చేయండి. అందుకు మీరు (బ్లాక్) అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.ఇక బ్యాంకింగ్/ఇన్సూరెన్స్/క్రెడిట్ కార్డ్‌లు/ఫైనాన్షియల్ ఉత్పత్తుల కోసం బ్లాక్, రియల్ ఎస్టేట్ కోసం బ్లాక్ 2 ఇంకా విద్య సంబంధిత స్పామ్‌ల కోసం బ్లాక్ 3 అలాగే ఆరోగ్యం కోసం బ్లాక్ 4, ఇంకా వినియోగ వస్తువులు/ఆటోమొబైల్స్/వినోదం/ఐటీ కోసం బ్లాక్ 5 అలాగే కమ్యూనికేషన్/బ్రాడ్‌కాస్టింగ్ కోసం బ్లాక్ 6 ఇంకా టూరిజం, విశ్రాంతి కోసం బ్లాక్ 7 ఆ తరువాత ఆహారం, పానీయాల కోసం బ్లాక్ 8...ఇలా మనం ఎంచుకున్న కోడ్‌లను 1909కి సందేశం పంపాలి.ఆ తరువాత మన అభ్యర్థనను నిర్ధారించే సందేశం వస్తుంది. ఇంకా అంతేకాదు ఈ సేవ 24 గంటల్లో ప్రారంభమవుతుంది.ఇంకా అలాగే టెలికాం యాప్స్ ద్వారా కూడా ఈ సర్వీస్‌ను యాక్టివేట్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంది. యాప్‌ను ఓపెన్ చేసి కొన్ని స్టెప్స్ కనుక మీరు ఫాలో అయితే సింపుల్‌గా ఈ సర్వీస్‌ను ఈజీగా యాక్టివేట్ చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: