బుల్లి పిట్ట: వాట్సాప్ నుంచి అదిరిపోయే అప్డేట్..!!

Divya
ప్రస్తుతం ఉన్న కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ కచ్చితంగా ఉపయోగిస్తూ ఉంటారు.వీటితోపాటు సోషల్ మీడియా కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అలా వాట్సాప్ ను కూడా ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో రకాల ఫిచర్స్ లను వాట్సాప్ సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది. వినియోగదారుల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తుంది ప్రస్తుతం వాట్సాప్ లో సరికొత్త ఫీచర్ వచ్చినట్లుగా తెలుస్తోంది వాటి గురించి తెలుసుకుందాం.
ఇప్పుడు లేటెస్ట్ గా స్టేటస్ ట్యాబ్లో న్యూస్ లెటర్స్ ని ఆప్షన్ అందిస్తోంది దీని ద్వారా కూడా భవిష్యత్తులో యూజర్స్ అప్డేట్ ను తెలుసుకోవచ్చట. వాట్సాప్ ను ట్రాక్ చేసే వెబ్సైట్..WABETAINFO నివేదిక ప్రకారం ప్రైవేటు న్యూస్ లెటర్ టూల్స్ ద్వారా దీనిని వినియోగదారులు తెలుసుకోవచ్చట. తమకు నచ్చిన బ్రాడ్ కాస్టర్స్ ని ఫాలో అవ్వచ్చట. ప్రస్తుతం వాట్సాప్ లో ఒక్కదాని తర్వాత మరొక స్టేటస్ లు కనిపిస్తూ ఉంటాయి కానీ ఇక రాబోయే భవిష్యత్తులో ఇంస్టాగ్రామ్ స్టోరీల మాదిరిగా హారిజంటల్ లేఔట్ లో కనిపించేలా వాట్స్అప్ చేంజ్ ను తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక అదే విధంగా న్యూస్ లెటర్స్ క్రియేట్ చేసి సబ్ స్క్రైబ్ చేసుకుని యూజర్లకు కూడా ప్రేవేసిని కాపాడుకునేందుకు వారి యొక్క మొబైల్ నెంబర్ ను కనిపించకుండా ఉంచుతారని ఈ నివేదిక తెలియజేస్తోంది. అయితే వీటికి ఎలాంటి అల్గారిథం సిస్టం లేదని అలాగే ఎటువంటి యాడ్స్ లు కూడా రావని క్రోనాలజికల్ ఆర్డర్ ప్రకారం కనిపిస్తాయని తెలియజేస్తున్నారు. వాటిపైన యూజర్లకు పూర్తిగా కంట్రోల్ ఉంటుందని తాము ఎవరిని ఫాలో అవుతున్నారో ఇతరులకు తెలిసి అవకాశం కూడా ఉండదని సమాచారం. ప్రస్తుతం ఇదంతా డెవలప్మెంట్ స్టేజ్ లోనే ఉందని భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి రాబోతోందని ఈ సంస్థ తెలియజేస్తోంది. ఇక రాబోయే రోజుల్లో ఇంస్టాగ్రామ్ ద్వారా ఎలా ఉపయోగించుకుంటున్నాము వాట్సాప్ ను కూడా అలాగే ఉపయోగించుకోవచ్చట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: