బుల్లి పిట్ట: ఇంటర్నెట్ లేకుండా అమౌంట్ సెండ్ చేయడం ఎలా..?

Divya
సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ ని ప్రతి అవసరానికి ఉపయోగిస్తున్నారు అని చెప్పడంలో సందేహం లేదు. రోజు దినచర్యలో స్మార్ట్ఫోన్ ద్వారానే చాలా పనులు చేస్తున్నాము. ముఖ్యంగా ఇతరులతో ఫోన్ మాట్లాడడానికి.. మెసేజ్ చేయడానికి.. గేమ్స్ ఆడటానికి.. మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి ఇలా ఎన్నో రకరకాలుగా మొబైల్ ను వాడుకుంటున్నాము. కేవలం కాలక్షేపానికి మాత్రమే కాదు బ్యాంక్ అకౌంట్ నుంచి ఇతరులకు అమౌంట్ పంపించాలన్నా కూడా మొబైల్ ప్రధమ ఆప్షన్ గా నిలుస్తోంది . ముఖ్యంగా మన దగ్గర ఉన్న డబ్బును ఇతరులకు పంపించాలి అంటే ప్రస్తుతం ఫోన్ పేటీఎం, గూగుల్ పే, మొబైల్ బ్యాంకింగ్ వంటి ఎన్నో ఆప్షన్ లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ యాప్స్ ద్వారా మనం సులభంగా ఇతరులకు డబ్బు పంపించవచ్చు.
అయితే ఈ యాప్స్ మీరు ఉపయోగించాలి అంటే కచ్చితంగా మీ ఫోన్లో ఇంటర్నెట్ ఉండాల్సిందే.  ఒకవేళ ఇంటర్నెట్ లేకపోతే ఈ యాప్స్ ద్వారా మనీ సెండ్ చేయలేము.  కానీ కేంద్ర టెలికాం సంస్థ గతంలో ప్రవేశపెట్టిన ఒక విధానం ద్వారా ఇంటర్నెట్ లేకపోయినా సరే ఇతరులకు మనం డబ్బు సెండ్ చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.. ముందుగా మీ బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయినా మొబైల్ నెంబర్ ద్వారా *99# అని డయల్ ప్యాడ్ లో ఎంటర్ చేయాలి.  అక్కడ మన బ్యాంకు డీటెయిల్స్ చూపడంతో పాటు సెండ్ మనీ . రిక్వెస్ట్ మనీ..బాలన్స్ ఎంక్వయిరీ ఇలా కొన్ని రకాల ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో మనకు కావాల్సిన ఆప్షన్ ఎంచుకోవచ్చు.
ఉదాహరణకు డబ్బు పంపించాలనుకుంటే సెండ్ మనీ ఆప్షన్ ఎంచుకోవాలి.  అప్పుడు మనీ ఏ విధంగా పంపించాలి అనే ఆప్షన్స్ కనిపిస్తాయి.. త్రూ మొబైల్ ద్వారా లేదా యూపీఐ నెంబర్ ద్వారా లేదా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ద్వారా ఇలా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. అప్పుడు మీరు యూపీఐ ద్వారా డబ్బు సెండ్ చేయాలనుకుంటే.. మనం ఎవరికైతే డబ్బు పంపించాలనుకుంటున్నామో వారి యొక్క యూపీఐ నెంబర్ అక్కడ ఎంటర్ చేసి సెండ్ చేయాలి. ఆ తర్వాత ఆ యూపీఐ ఐడి యొక్క పేరు వివరాలను మనకు చూపిస్తుంది. వాటిని మరొకసారి చెక్ చేసి అమౌంట్ ఎంటర్ చేసి సెండ్ చేస్తే సులభంగా మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇందుకు ఎటువంటి ఇంటర్నెట్ అవసరం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: