వాట్సాప్ పే ఫీచర్ లో క్యాష్‌బ్యాక్

Vimalatha
వాట్సాప్ వాట్సాప్ పే, గ్రూప్ వంటి కొత్త ఫీచర్లపై పని చేస్తోంది. ఈ ఫీచర్లలో కొన్ని ఇప్పటికే బీటా రోల్‌అవుట్‌లో కనిపించాయి. మిగిలినవి డెవలప్ మెంట్ జరిగిన తర్వాత బీటా ప్లాట్‌ఫామ్‌లోకి ప్రవేశిస్తాయని భావిస్తున్నారు.
వాట్సాప్ పేమెంట్స్ యూజర్లకు క్యాష్‌ బ్యాక్ అందించే పనిలో ఈ ఫీచర్‌లు చాలా ముఖ్యమైనవి. సమాచారం ప్రకారం వాట్సాప్ పే ద్వారా మంచి క్యాష్ బ్యాక్ ఆఫర్ లను అందించబోతోంది. వినియోగదారులు వారి తదుపరి చెల్లింపుపై క్యాష్‌బ్యాక్ పొందవచ్చని తెలియజేస్తూ పుష్ నోటిఫికేషన్‌ వచ్చినట్టు ఓ స్క్రీన్ షాట్ చూపుతుంది.
వాట్సాప్ చెల్లింపులపై క్యాష్‌బ్యాక్ రాబోయే అప్‌డేట్‌లలో అందుబాటులో ఉంటుందని WABetaInfo చెబుతోంది. వాట్సాప్ చెల్లింపులపై వినియోగదారులకు రూ. 10 వరకు క్యాష్‌బ్యాక్ అందించే అవకాశం ఉంది. అయితే రోల్ అవుట్ దగ్గరపడుతున్న కొద్దీ ఈ పరిమితి మారవచ్చని నివేదిక పేర్కొంది.
భారతదేశంలో UPI చెల్లింపులకు మాత్రమే క్యాష్‌బ్యాక్ ఫీచర్ వర్తిస్తుందని, 48 గంటల్లోపు యూజర్ ఖాతాలో డబ్బు క్రెడిట్ చేయబడుతుందని కూడా నివేదిక స్పష్టం చేసింది. ఈ ఫీచర్ గురించి ఇంకా పెద్దగా తెలియకపోయినప్పటికీ,పేటీఎమ్ వంటి క్యాష్‌బ్యాక్ ప్రోగ్రామ్‌లు వాట్సాప్ ద్వారా అమలయ్యే అవకాశం ఉంది.  
వాట్సాప్ గ్రూప్ కొత్త ఫీచర్లు
బీటా అప్‌డేట్‌లో వాట్సాప్ గ్రూప్ యూజర్ల కోసం వాట్సాప్ కొన్ని కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. ఆండ్రాయిడ్ కోసం వాట్సాప్ 2.21.20.2 బీటా కొత్త గ్రూప్ ఐకాన్ ఎడిటర్ ఫీచర్‌ని అందిస్తుంది. ఈ ఫీచర్ వినియోగదారుల ఫోటోలకు బదులుగా గ్రూప్ డిస్‌ప్లే ఇమేజ్‌లుగా ఉంచే ఐకాన్‌లను సృష్టిస్తుంది. ఐకాన్‌తో పాటు యూజర్లు బ్యాక్‌గ్రౌండ్ కలర్‌ని కూడా ఎంచుకోగలరు.
ఇక వాట్సాప్ iOS కోసం వాట్సాప్ లోని గ్రూప్ ఇన్ఫర్మేషన్ పేజీ కోసం కొత్త డిజైన్ కోసం కూడా పనిచేస్తోంది. కొత్త డిజైన్ మునుపటి కంటే పెద్ద చాట్, కాల్ బటన్లను తెస్తుంది. ఇప్పుడు వాటిని సులభంగా యాక్సెస్ చేయడానికి ముందు, మధ్యలో ఉంచుతుంది. ఈ సరికొత్త రీడిజైన్ iOS బీటా వేరియంట్ 2.21.190.15 ను వాట్సాప్ త్వరలో పబ్లిక్‌గా విడుదల చేయబడుతుందని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: