జీ మెయిల్ లో ఈ సీక్రెట్ ఫీచర్స్ గురుంచి మీకు తెలుసా ..!

Suma Kallamadi
ప్రస్తుత స్మార్ట్ యుగంలో ప్రతి ఒక్కరికీ జీ మెయిల్ అకౌంట్ తప్పనిసరిగా ఉంటుంది. అంతలా జీ మెయిల్ అందరికీ అత్యవసరమైపోయింది. అంతలా జీ మెయిల్ మనందరి జీవితాల్లో నిత్య కృత్యంగా మారిపోయింది. ఎటువంటి బ్యాంకు పనులైనా, జాబ్ లకు సంబంధించిన పనులైనా నేడు జీ మెయిల్ ద్వారానే జరుగుతున్నాయి. ఒక్క సారి జీ మెయిల్ సరిగ్గా పని చేయకపోతే... అందరూ పనులు మానుకుని కూర్చోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అలా ప్రజలకు తప్పనిసరి అయిన జీ మెయిల్ లో కూడా మనకు తెలియని చాలా షార్ట్ కట్స్ ఉన్నాయనే విషయం ప్రపంచంలో చాలా మందికి తెలియదు. ఆ షార్ట్ కట్స్ ఇప్పుడు మీ కోసం...

•స్మార్ట్ కంపోజ్: ఈ ఫీచర్ గురించి మనలో చాలా మందికి తెలియదు. దీనిని ఎనేబుల్ చేయడం వలన మనం ఏం టైప్ చేస్తున్నామో ముందుగానే పిసిగట్టి దానిని డిస్ ప్లే మీద కనబడేలా చేస్తుంది. మన జీ మెయిల్ లో కూడా ఈ ఫీచర్ ను ఎనేబుల్ చేసేందుకు సెట్టింగ్స్ లోకి వెళ్లి... Smart Compose అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి, అటు తర్వాత Writing Suggestions On అనే ఆప్షన్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది.

 
•షెడ్యూల్ ఈమెయిల్‌: ఈ ఫీచర్ ను గనుక మన జీ మెయిల్ అకౌంట్ లో ఎనేబుల్ చేసుకుంటే మనం కంపోజ్ చేసి ఉంచిన సందేశాన్ని ఎప్పుడైనా పంపొచ్చు. ఇందుకోసం కంపోజ్ చేసి సెండ్ చేసేటపుడు షెడ్యూల్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం రైట్ క్లిక్ ఇచ్చి... Schedule send అనే ఆప్షన్ ను క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా చేసిన తర్వాత మీరు ఏ సమయానికి ఆ మెయిల్ ను సెండ్ చేయాలని భావిస్తున్నారో టైం, డేట్ ఫిక్స్ చేస్తే సరిపోతుంది.

 
•మెసేజ్ ఫాస్టర్: ఇంతటి అద్భుతమైన ఫీచర్ ios వెర్షన్ వాడే వినియోగదారులకు అందుబాటులో లేకపోవడం చాలా మైనస్. కానీ ఈ మెసేజ్ ఫాస్టర్ ఫీచర్ ను డెస్క్ టాప్ వెర్షన్, లేదా ఆండ్రాయిడ్ వెర్షన్ లో ఎనేబుల్ చేసుకునేందుకు వీలుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: