బుల్లిపిట్ట: అదిరిపోయే ఫీచర్స్ తో నేడు రిలీజ్ అవుతున్న వన్ ప్లస్ నార్డ్...!

Durga Writes

ఈ మధ్య కాలంలో బాగా హైప్ వచ్చిన స్మార్ట్‌ ఫోన్ వన్ ‌ప్లస్ నార్డ్. ఇకపోతే ఇందుకు చాలా కారణాలే ఉన్నాయి. ఇన్నిరోజులు కేవలం ప్రీమియం మొబైల్ ఫోన్స్ మాత్రమే విడుదల చేసిన వన్ ప్లస్ మొట్టమొదటిసారిగా మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో కి కాలు మోపుతోంది. అయితే ఇక ఈ మొబైల్ లాంచ్ కోసం వన్ ప్లస్ సంస్థ ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా ఆగ్యుమెంటెడ్ రియాల్టీ టెక్నాలజీ ద్వారా లాంచింగ్ ఈవెంట్ ను నిర్వహించబోతోంది. ఇక ఈ మొబైల్ కోసం ప్రపంచవ్యాప్తంగా వన్ ప్లస్ అభిమానులు లాంచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వన్ ప్లస్ సంస్థ నేడు సాయంత్రం సరిగ్గా 7:30 సమయంలో వన్ ప్లస్ నార్డ్ మొబైల్ మోడల్ ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. 


ఇందుకు సంబంధించిన ఈవెంట్ ను చూడాలని అనుకునేవారు వన్ ప్లస్ అధికారిక వెబ్ సైట్ తోపాటు, వన్ ప్లస్ నార్డ్ ఏఆర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్స్ లో విరివిరిగా వీక్షించవచ్చు. ఇప్పటికే వారి అభిమానులకు ఇన్విటేషన్ కూడా అమ్మింది కంపెనీ యాజమాన్యం. ఇక ఈ మొబైల్ కు సంబంధించి ఫీచర్ల విషయం చూస్తే... ఇందులో స్నాప్ ‌డ్రాగన్ 765జీ, 5జీ ప్రాసెసర్, 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ + అమొలెడ్ డిస్‌ప్లే, 32 మెగా పిక్సెల్ డ్యూయెల్ ఫ్రంట్ కెమెరా. 48 మెగా పిక్సెల్ క్వాడ్ కెమెరా లాంటి అనేక ప్రత్యేకతలున్నాయి. ఇక ఈ మొబైల్ ‌తో పాటు వన్‌ ప్లస్ బడ్స్ కూడా లాంఛింగ్ కూడా ఉంటుంది.

 


వీటితో పాటు 128జీబీ, 256జీబీ వేరియంట్స్ లో ఇంటర్నల్ స్టోరేజ్, 48+8+5+2 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 32+8 మెగాపిక్సెల్ ఉన్న ఫ్రంట్ కెమెరా,  4,115 ఎంఏహెచ్ ఉన్న బ్యాటరీ ఇందులో పొందవచ్చు. ఇక ఈ మొబైల్ ఫోన్ ధరల విషయానికి వస్తే.. 8 + 128 జిబి మొబైల్ రూ. 21,999 ఉండగా,  12 + 256 జిబి మొబైల్ రూ. 24,999 గా నిర్ధారించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: