
ధోనీకీ ప్రతినెల బీసీసీఐ ఎంత పెన్షన్ ఇస్తుందో తెలుసా ..?
ఇండియన్ ఆటగాళ్లకు ఆర్దిక భద్రత కల్పించడం కోసమే వీటిని తీసుకోవచ్చారట. అయితే ఇందులో భాగంగా 75 కంటే ఎక్కువ టెస్ట్ లు ఆడిన లేదా 50 కంటే ఎక్కువ వన్డేలు ఆడినటువంటి క్రికెటర్లకు 70 వేల రూపాయల వరకు పెన్షన్ ని అందిస్తారట. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ తీసుకున్న ఆటగాళ్లకు 2022 నుంచి ఈ పెన్షన్ పథకాన్ని మరింత మెరుగుపరిచేలా నిర్ణయాలు తీసుకుంటున్నారట. ఇటీవలే బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ తీసుకున్నటువంటి నిర్ణయాలతో క్రికెట్ ఆటగాళ్లకు పెన్షన్ మరింత పెరిగిందట.
పురుషులతో పాటు మహిళా క్రికెటర్స్ కు కూడా ఈ పథకం వర్తిస్తుందట.. ఇక ధోని విషయానికి వస్తే.. ధోని తన కెరీర్లు 90 టెస్టులు, 350 వన్డేలు, 98T20 లు ఆడారట దీంతో అతనికి బీసీసీఐ నెలకు 70 వేల రూపాయలు పెన్షన్ ఇస్తోందట. కానీ ధోని ఆర్థికంగా స్థిరంగా బాగా ఉండడంతో ఒక చారిటీ కార్యక్రమాలకు ఈ డబ్బును ఇస్తున్నట్లు సమాచారం. అలాగే సునీల్ గవాస్కర్, సచిన్ టెండుల్కర్ కు కూడా 70 వేల రూపాయలు ఇస్తున్నారట.. యువరాజ్ సింగ్ 60000 ఇస్తున్నారట.. ఇలా వీరికే కాకుండా చాలామంది క్రికెటర్స్ కి సైతం ఆర్థికంగా ఈ పెన్షన్ ఇవ్వడం వల్ల వారికి ఉపయోగపడుతున్నట్లు తెలుపుతున్నారు.