ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో వీళ్లు గనుక చెలరేగిపోతే కప్పు మనదే..?

praveen
భారత జట్టుకు స్పిన్ బౌలింగ్ ఎప్పుడూ ఒక పెద్ద అస్త్రం. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో అయితే నలుగురు స్పిన్నర్లు ఉన్నారు. వాళ్లు అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి. ఫైనల్ వరకు భారత్ దూసుకుపోవడానికి మెయిన్ రీజన్ వీళ్లే. ఒక్కొక్కరూ ఒక్కో స్టైల్ లో బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థుల్ని ముప్పుతిప్పలు పెడుతున్నారు. అందుకే మన టీమ్ అటాక్ ఇప్పుడు తిరుగులేని రేంజ్ లో ఉంది.

అక్షర్ పటేల్ అంటే పక్కాగా లైన్ అండ్ లెంగ్త్ మెయింటైన్ చేస్తూ బౌలింగ్ చేయడం కోసం పుట్టాడన్నట్టు ఉంటది. బ్యాట్స్ మెన్ పరుగులే తీయకుండా కట్టడి చేస్తాడు. అందుకే రోహిత్ శర్మ పవర్ ప్లే ఓవర్లలోనే అతనికి బంతి ఇస్తాడు. అక్షర్ బౌలింగ్ లో ఎక్స్‌ట్రా బౌన్స్ కూడా ఉంటుంది, దాంతో బ్యాట్స్ మెన్ ఈజీగా ఔట్ అయిపోతారు. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో స్టార్టింగ్ లోనే రెండు కీలకమైన వికెట్లు తీసి మ్యాచ్ ని టర్న్ చేసేశాడు. మన స్పిన్నర్లలో తక్కువ ఎకానమీ రేట్ (4.51) ఉన్నది కూడా అక్షర్ కే, అందుకే ప్రత్యర్థులు స్కోర్ చేయడానికి భయపడతారు.

జడేజా ఒక సూపర్ స్మార్ట్ బౌలర్. సిట్యువేషన్ ని బట్టి బౌలింగ్ స్పీడ్, లెంగ్త్ మారుస్తాడు. బంతిని బాగా స్పిన్ చేయగలడు, అంతే కాదు స్కిడ్ అయ్యేలా కూడా వెయ్యగలడు. అందుకే జడేజా అంటే బ్యాట్స్‌మెన్‌కి భయం. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్‌లో కీలకమైన టైమ్ లో రెండు వికెట్లు తీసి పార్ట్‌నర్‌షిప్‌లను బ్రేక్ చేసేశాడు. మిడిల్ ఓవర్లలో మ్యాచ్ ని కంట్రోల్ చేయడంలో జడేజా తర్వాతే ఎవరైనా.

కుల్దీప్ యాదవ్ లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్, ఇలాంటి బౌలర్లు చాలా తక్కువ మంది ఉంటారు. బంతిని రెండు వైపులా తిప్పగలడు, అందుకే బ్యాట్స్ మెన్ కుల్దీప్ బౌలింగ్ ని అస్సలు ఊహించలేరు. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో అయితే ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా సల్మాన్ ఆఘా, షాహీన్ ఆఫ్రీదీలను అవుట్ చేసిన గూగ్లీలు అయితే నెక్స్ట్ లెవెల్.

వరుణ్ బౌలింగ్ స్టైలే డిఫరెంట్. అందుకే అతన్ని రీడ్ చేయడం చాలా కష్టం. క్యారమ్ బాల్, గూగ్లీ లాంటి వెరైటీ బంతులు చాలా ఉన్నాయి అతని దగ్గర. న్యూజిలాండ్ తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ డెబ్యూ మ్యాచ్ లోనే ఏకంగా ఐదు వికెట్లు తీసి ఇండియా గెలవడానికి కారణం అయ్యాడు.

ఈ నలుగురు స్పిన్నర్లు కలిసి పరుగుల్ని కంట్రోల్ చేస్తూ వికెట్లు తీస్తున్నారు. ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై వీళ్లు గనుక చెలరేగిపోతే, ఇండియాను ఆపడం ఎవరి తరం కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: