విరాట్ కోహ్లీ తాగే బ్లాక్ వాటర్ బాటిల్ ధర ఎంతో తెలుసా..?
విరాట్ కోహ్లీ తాను తాగే నీటి పైన ఎక్కువగా శ్రద్ధ పెడుతూ ఉంటారు. ఆయన తాగే నీరు కూడా చాలా ఖరీదైనదిగా తెలుస్తోంది. అయితే ఈ నీరు సాధారణ నీటి కంటే చాలా ఖరీదైనదిగా ఉన్నదట. కరోనా సమయం నుంచి ఎక్కువగా ఈ నీటిని చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా తాగుతున్నారట. ఈ బ్లాక్ వాటర్ ని నల్ల ఆల్కలీన్ నీరు అని పిలుస్తారట. ఇది చాలా ప్రత్యేకమైన నీరు అన్నట్లుగా తెలియజేశారు. ఇందులో ఎక్కువగా ఖనిజాలు ,క్షార లవణాలు ఉంటాయట. అలాగే పీహెచ్ స్థాయి కూడా సాధారణ నీటి కంటే ఎక్కువ మొత్తంలో ఉంటుందట. ఇది శరీరాన్ని డ్రై కాకుండా ఉంచడంలో సహాయపడుతుంది.
అలాగే శరీరంలో ఉండే ఆమ్లాన్ని సైతం తగ్గించడంలో జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయట. అలాగే శరీరంలో ఉండే ఆమ్లతను కూడా నియంత్రించడానికి ఈ నిరు ఉపయోగపడతాయి ఇందులో సుమారుగా 70 పైగా పలు రకాల ఖనిజాలు ఉంటాయట. ఇవి శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. శరీరానికి వెంటనే శక్తిని కూడా లభించేలా చేస్తాయట. అయితే ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ బ్లాక్ వాటర్ ధర సుమారుగా 4000 రూపాయలు లీటర్ బాటిల్ ఉంటుందట. అయితే దీనిని భారత్లో ఆన్లైన్ స్టోర్లలో మాత్రమే కొనుగోలు చేస్తారట అలాగే కొన్ని కంపెనీలు నేరుగా ఆర్డర్ పెట్టిన కూడా ఇంటికే పంపిస్తారట.