చివరి మ్యాచ్ ఆడుతున్న ఇండియన్ క్రికెటర్.. ఎవరో తెలుసా?

frame చివరి మ్యాచ్ ఆడుతున్న ఇండియన్ క్రికెటర్.. ఎవరో తెలుసా?

praveen
భారతదేశ అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకడి పేరు చెప్పమంటే ఠక్కున 'వృద్ధిమాన్ సాహా' పేరు మనకి గుర్తుకు వస్తుంది. అలాంటి వృద్ధిమాన్ తన అభిమానులకు ఓ చేదు వార్తను అందించాడు. అవును, వృద్ధిమాన్ తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్‌కు టాటా చెబుతున్నాడు. రంజీ ట్రోఫీ 2024 - 25 ఏడో రౌండ్ తర్వాత సాహా ఆటకు గుడ్‌బై చెప్పనున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. 24 అక్టోబరు 1984లో జన్మించిన వృద్ధిమాన్ క్రికెట్ మీద ఉన్న మక్కువతో క్రికెట్ ప్రపంచంలోకి అరంగేట్రం చేయడం జరిగింది. ఈ క్రమంలో భారత జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపిక అయ్యాడు. అతను కుడిచేతి వాటం కలిగిన వికెట్ కీపర్ మరియు బ్యాట్స్‌మెన్. దేశీయ క్రికెట్‌లో త్రిపుర క్రికెట్ జట్టుకు ప్రస్తుత ఫస్ట్ క్లాస్ కెప్టెన్, అయిన ఇతడు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ టైటాన్స్‌కు వికెట్ కీపర్ గా వ్యవహరించాడు. ఈ క్రమంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్‌లో సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు.

ఇక గత సంవత్సరం నవంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సాహా, అప్పట్లోనే ఈ రంజీ సీజన్ తన చివరిది అని ఓ హిట్ అయితే ఇచ్చాడు. కాగా బెంగాల్ జట్టు ప్రస్తుత రంజీ ట్రోఫీ సీజన్‌లో సరిగ్గా ఆడలేకపోయింది. 6 మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలవగలిగింది. దీంతో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకునే అవకాశాలు లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో సాహా తన చివరి మ్యాచ్‌ను ఏడో రౌండ్‌లో ఆడబోతున్నాడు.

వృద్ధిమాన్ సాహా ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్ విషయానికొస్తే, 141 మ్యాచ్‌లలో 209 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసి 41.68 సగటుతో 7169 పరుగులు సాధించగలిగాడు. ఈ లిస్టులో 14 శతకాలు, 44 అర్ధశతకాలు ఉన్నాయి. రంజీ విషయానికొస్తే వృద్ధిమాన్ 203 అత్యధిక స్కోరు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇక సాహా అంతర్జాతీయ క్రికెట్‌లో చెప్పుకోదగినంత రాణించలేకపోయినా, వికెట్ కీపింగ్‌లో మాత్రం అత్యుత్తమంగా నిలిచాడు అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. మొత్తం 40 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ఆయన 56 ఇన్నింగ్స్‌ల్లో 1353 పరుగులు సాధించాడు. ఇందులో 3 శతకాలు, 9 అర్ధశతకాలు ఉన్నాయి. సాహా తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నప్పటికీ, భారత క్రికెట్‌లో వికెట్ కీపింగ్ నైపుణ్యాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆటగాడిగా మాత్రం ఎన్నటికీ గుర్తుండిపోతాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: