వారెవ్వా.. కెప్టెన్ రోహిత్ కు దక్కని గౌరవం.. తెలుగోడు నితీష్ కి దక్కిందిగా?

praveen
అవును, మీరు విన్నది నిజమే. కెప్టెన్ రోహిత్ కు కూడా అటువంటి గౌరవం ఇప్పటి వరకు దక్కక పోవడం కొసమెరుపు. బాక్సింగ్ డే టెస్ట్‌లో సెంచరీతో ఇరగదీసిన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయాడనే విషయం అందరికీ తెలిసినదే. దాంతో ఇప్పుడు ఎక్కడ చూసినా అతడి సెన్సేషనల్ బ్యాటింగ్ గురించే మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. విషయం ఏమిటంటే... విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ లాంటి స్టార్లు ఆటగాళ్లు సైతం ఫెయిలైన చోట.. 8వ నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగి సెంచరీ చేయడాన్ని దాదాపు అందరూ మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే కాకలు దీరిన కమిన్స్, లియాన్, స్టార్క్‌ను ఎదుర్కొని నిలబడడమంటే మామ్మూలు విషయం కాదు. దాంతో అన్ని రకాల ప్రజలనుండి ప్రశంసలు అందుకుంటున్నాడు ఈ తెలుగోడు.
అయితే ఇపుడు తాజాగా నితీష్ ఓ అరుదైన గౌరవాన్ని కూడా అందుకున్నాడు. విషయంలోకి వెళితే.. 150 ఏళ్ల ఘనచరిత్ర ఉన్న మెల్‌బోర్న్ క్రికెట్‌ గ్రౌండ్‌లో ఓ సంప్రదాయం ఉంది. ఆ స్టేడియంలో టెస్టుల్లో సెంచరీలు బాదిన విదేశీ బ్యాటర్ల పేర్లను హానర్స్ బోర్డులో నమోదు చేస్తారు. ఇది ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న ఆనవాయితీ. కాగా తాజా మ్యాచ్‌లో కూడా దీనినే కంటిన్యూ చేశారు. టీమిండియా తరఫున శతకం బాదిన నితీష్ రెడ్డి పేరును ఈ హానర్స్ బోర్డులో చేర్చారు. గత పర్యటనలో ఇక్కడ సీనియర్ బ్యాటర్ అజింక్యా రహానె సెంచరీ కొట్టాడు. దాంతో అతడి పేరు కింద నితీష్ పేరును చేర్చారు. ఈ మేరకు ఈ బోర్డును ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌ విజిటర్స్ హానర్స్ బోర్డులో నితీష్ పేరు ఉన్న ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఇకపోతే గతంలో ఈ మైదానంలో టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్, విధ్వంసక వీరుడు వీరేంద్ర సెహ్వాగ్, రిషబ్ పంత్ తదితర భారత ఆటగాళ్లు సెంచరీలు బాదారు. ఇప్పుడు వాళ్ల సరసన ఈ యాంగ్ బ్యాతారు చోటు దక్కించుకోవడం విశేషం. దీన్ని చూసిన నెటిజన్స్.. శభాష్ నితీష్ అంటూ ప్రశంసిస్తున్నారు. ఇక 21 ఏళ్ల వయసులోనే తొలి ఆసీస్ పర్యటనలో ఇలా చెలరేగి ఆడటం, పైగా కంగారూ బౌలర్లను కంగారు పెట్టించి బాదడం అనేది ముఖ్యంగా మన తెలుగుగాళ్లను ఖుషీ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: