జైస్వాల్ రనౌట్.. అతని కోసం కొట్టుకుంటున్న మాజీలు?

praveen
భారత్, ఆస్ట్రేలియా మధ్య మెల్‌బోర్న్‌ వేదికగా 4వ టెస్టు జరుగుతున్న విషయం క్రికెట్ క్రీడాభిమానులకు తెలిసిన విషయమే. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్‌ కాగా, రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఈ క్రమంలో యశస్వి జైస్వాల్ (82), విరాట్ కోహ్లీ (36) జోడీ మూడో వికెట్‌కు 102 పరుగులు చేయగా, ఆట చివర్లో భారత్ వరుసగా 3 వికెట్లు కోల్పోయి అందరికీ షాక్ ఇచ్చింది. యశస్వి జైస్వాల్ అవసరం లేని చోట సింగిల్‌ కోసం కెలికి మరీ రనౌట్ కావడంతో క్రీడాకారులతో పాటుగా, మ్యాచ్ చూసే ఆడియన్స్ కూడా చివుక్కుమన్నారు.
బోలాండ్‌ బౌలింగ్‌ చేయగా, మిడాన్‌ వైపుగా బంతిని కొట్టిన యశస్వి పరుగు కోసం నాన్‌స్ట్రైకింగ్‌ ఎండ్‌కు అనవసరంగా పరుగెత్తాడు. ఈ క్రమంలో కోహ్లీ వద్దని వారించినా వినలేదు. దాంతో కోహ్లీ వెనక్కి వెళ్ళిపోయాడు. అయితే అప్పటికే తప్పు జరిగిపోయింది. యశస్వి ఇటువైపు వచ్చేశాడు. కట్ చేస్తే, మిడాన్‌ ఫీల్డర్ కమిన్స్ నేరుగా స్ట్రైకింగ్ వైపు బంతిని విసరగా వికెట్ కీపర్‌ బంతిని తీసుకొని స్టంప్స్‌ను ఎగరగొట్టాడు. ఈ రనౌట్‌పై స్టార్‌స్పోర్ట్స్‌ లైవ్‌ చర్చలో భారత మాజీ క్రికెటర్లు సంజయ్‌ మంజ్రేకర్, ఇర్ఫాన్ పఠాన్‌ల మధ్య మాటల యుద్ధమే జరిగిందని చెప్పుకోవచ్చు.
అవును.. కోహ్లీ వల్లే యశస్వి రనౌట్ అయ్యాడని మంజ్రేకర్ వాదిస్తూ... "కోహ్లీ స్కూల్‌పిల్లాడిలా ప్రవర్తించాడు. బంతి వైపు చూస్తూ పరుగు చేయకూడదని నిర్ణయించడం తప్పు. అది నాన్‌స్ట్రైకర్ తీసుకోవాల్సిన నిర్ణయం కదా. ఆ బంతిని ఎదుర్కొన్న బ్యాటర్‌ అది డిసైడ్ చేయాలి. ఒకవేళ జైస్వాల్‌ తప్పుగా పరుగెత్తి ఉంటే కమిన్స్‌ నాన్‌స్ట్రైకర్‌ వైపు బంతి విసిరేవాడు. కానీ, కోహ్లీ నో చెప్పడంతో యశస్వికి మరో అవకాశం లేకుండా పోయింది పాపం!" అని మంజ్రేకర్ అనగా... ఇర్ఫాన్ పఠాన్ దానికి స్పందిస్తూ.. "బంతి వేగాన్ని బట్టి పరుగుకు రావాలో, వద్దో నాన్‌స్ట్రైకర్‌ చెప్పొచ్చు!" అన్నాడు. ఈ క్రమంలో మరలా మంజ్రేకర్ ఏదో చెప్పబోతుండగా ఇర్ఫాన్‌ అలాగే కొనసాగించాడు. దీంతో మంజ్రేకర్.. నువ్వు వినకపోతే చెప్పడానికేమీలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: