మ్యాచ్లు ముగుస్తున్న కొద్ది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్
క్రికెట్ ఫైనల్ రేసు రసవత్తరంగా మారుతుంది. టాప్ టులో నిలిచి ఫైనల్లో ఆడటం కోసం ఐదు సీట్లు
భారత్ -
ఆస్ట్రేలియా - దక్షిణాఫ్రికా -
న్యూజిలాండ్ -
శ్రీలంక పోటీపడుతున్నాయి. ప్రస్తుతం భారత జట్టు 61.11లతో అగ్రస్థానంలో ఉంది. స్వదేశంలో జరుగుతున్న రెండు టెస్టుల సీరియస్ లో తొలి మ్యాచ్లో శ్రీలంకపై ఏకంగా 203 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన దక్షిణాఫ్రికా 59.26 పాయింట్లతో రెండో స్థానంలోకి దూసుకు వచ్చింది. దీంతో
ఆస్ట్రేలియా 57.69 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయింది.
న్యూజిలాండ్ 50.00 -
శ్రీలంక 50.00 తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మూడు టెస్టులు సిరీస్ తొలి మ్యాచ్లో
న్యూజిలాండ్ పై
ఇంగ్లాండ్ విజయం సాధించడంతో డబ్ల్యూటీసీ ఫైనల్ సమీకరణలు మారిపోయాయి. ప్రస్తుతం టీమిండియా ఫైనల్ మ్యాచ్‌కు
అర్హత సాధించాలంటే సమీకరణలు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీని గెలిస్తే ఇతర సీరిస్‌ల ఫలితాలతో సంబంధం లేకుండా నేరుగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు భారత జట్టు
అర్హత సాధిస్తుంది.
అదే
భారత్ 3 - 1 తేడాతో ఈ సీరిస్ గెలిచినా ఫైనల్ కి వెళుతుంది .. కానీ
సౌత్ ఆఫ్రికా తో జరిగే రెండు టెస్టులలో
శ్రీలంక విజయం సాధిస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఒకవేళ
సౌత్ ఆఫ్రికా -
శ్రీలంక మధ్య రెండో మ్యాచ్ డ్రా అయినా కూడా ఆసీస్ పై
భారత్ 3 - 1 తో గెలిస్తే ఫైనల్ కి చేరుతుంది. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ సిరీస్ 2 - 2 డ్రా అయినా కూడా
భారత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరటానికి అవకాశాలు ఉంటాయి. ఇలా జరగాలంటే ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న సీరీస్ ను దక్షిణాఫ్రికా 2 - 0 తేడాతో కైవసం చేసుకోవాలి. అంతేకాకుండా
ఆస్ట్రేలియా తో జరిగే రెండు మ్యాచ్లు టెస్ట్ సిరీస్ ను
శ్రీలంక కనీసం 1 - 0తో గెలుచుకోవాలి. అప్పుడు బార్డర్ గవాస్కర్ ట్రోఫీని
భారత్ 2 - 2 తో డ్రా చేసుకున్న ఫైనల్ కి వెళుతుంది.