SRH లోకి మలింగ.. ఇతను ఆ మలింగాలాగేనా.. వీడియో వైరల్?

frame SRH లోకి మలింగ.. ఇతను ఆ మలింగాలాగేనా.. వీడియో వైరల్?

praveen
తాజాగా ముగిసిన ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు శ్రీలంక క్రికెటర్ ఈషాన్ మలింగాను రూ.1.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఈషాన్ మలింగా అనే పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చేది లసిత్ మలింగానే. అతని ఇప్పుడు ఈ యువ ప్లేయర్ గుర్తు చేస్తున్నాడు. తన కర్లీ హెయిర్, విచిత్రమైన బౌలింగ్ యాక్షన్, డెడ్లీ యార్కర్‌లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లసిత్ మలింగా ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చాలా కాలం పాటు రికార్డును కలిగి ఉన్నాడు.
అయితే ఈషాన్ మలింగా లసిత్ మలింగ ఇద్దరూ బంధువులు. అతనికి అల్లుడు అవుతాడు కానీ ఈ యువ ప్లేయర్  తన మామ లసిత్ మలింగాలా ఉండడు. అతనికి గుండ్రటి జుట్టు లేదు, మథీషా పతిరాణ, నువాన్ తుషార వంటి ఆటగాళ్లు చేసే విధంగా విచిత్రమైన బౌలింగ్ యాక్షన్ కూడా లేదు. అయినప్పటికీ, లసిత్ మలింగా కుటుంబం నుంచి మరో క్రికెటర్ ఐపీఎల్‌లోకి అడుగుపెట్టడం క్రికెట్ అభిమానులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
2001 ఫిబ్రవరి 4న జన్మించిన ఈషాన్ మలింగా, లంక ప్రీమియర్ లీగ్ (ఎల్‌పీఎల్)లో జఫ్నా కింగ్స్ తరఫున ఆడుతూ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 14 మ్యాచ్‌లలో 28 వికెట్లు తీశాడు. అతని అత్యుత్తమ ప్రదర్శన 6/67. లిస్ట్-ఏ మ్యాచ్‌లలో 7 మ్యాచ్‌లలో 12 వికెట్లు తీశాడు, అతని అత్యుత్తమ ఫిగర్స్ 5/49. టీ20ల్లో 8 మ్యాచ్‌లలో 7 వికెట్లు తీశాడు.
2025 ఐపీఎల్ సీజన్ ఈషాన్‌కు తొలి సీజన్. జఫ్నా కింగ్స్ తరఫున ఆడుతూ అతను రూ. 60 లక్షలు సంపాదించాడు. కానీ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో చేరిన తర్వాత అతని జీతం రెట్టింపైంది. శ్రీలంక జాతీయ జట్టు తరఫున ఇంకా ఆడలేదు. అయితే ఈ ప్లేయర్ కి సంబంధించిన వీడియోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి  అవన్నీ చూసి లసిత్ మలింగ బౌలింగ్ రికార్డులను చాలామంది అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. అతడు మలింగా లాగానే బోలింగ్ చేసి రికార్డ్స్ నెలకొల్పుతాడా అనే కోణంలో మేడ్చల్ కూడా మొదలుపెట్టేశారు.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: