బీసీసీఐ సంచలన నిర్ణయం.. రోహిత్,కోహ్లీ, జడేజాలకు షాక్ తప్పదా?
ఈ నేపథ్యంలో భారత జట్టు సీనియర్లు రోహిత్ శర్మ, కోహ్లి, జడేజాల టెస్ట్ క్రికెట్ భవితవ్యం కాస్త ప్రశ్నార్థకంగా మారబోతున్నట్లు తెలుస్తోంది. ఇక సినియర్స్ ను పక్కనబెట్టాలని డిమాండ్లు పెద్దెత్తున వస్తుండటంతో బోర్డర్ గవాస్కర్ సిరీస్లో వారి ఆటతీరును బీసీసీఐ స్వయంగా పర్యవేక్షించబోతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ టీంతోపాటు ఆస్ట్రేలియాలోనే ఉండి కోచ్ గౌతమ్ గంభీర్ తో కలిసి ఈ ముగ్గురి భవిష్యత్తుపై చర్చింవచ్చనే ప్రచారం జోరందుకుంది. దింతో వారికీ ఆడబోయే ఆఖరి సిరీస్ అయ్యే ఛాన్సూ ఉంది.
ఇక మరోవైపు, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకోవాలంటే, ఆస్ట్రేలియాతో జరిగే 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత జట్టు 4-0తో గెలవాలి. ఈ సమయంలో జట్టు ఒక్క మ్యాచ్‌లో అయినా ఓడిపోతే, జట్టు WTC ఫైనల్‌కు దూరంగా ఉండాల్సిందే. భారత్ ఈ WTC సైకిల్‌కు అర్హత సాధించకపోతే, వచ్చే ఏడాది జూన్ 20 నుంచి ఇంగ్లాండ్‌లో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌తో తదుపరి చక్రం ప్రారంభం కానుంది. దాంతో జట్టుకు పునాది వేయగల ఆటగాళ్లను సెలక్షన్ కమిటీ ఎంచుకోవలసి ఉంటుంది.