ఏంటి.. మైక్ టైసన్ మ్యాచ్ ముందే ఫిక్స్ అయిందా.. అతను చెప్పిందే జరిగిందే?

frame ఏంటి.. మైక్ టైసన్ మ్యాచ్ ముందే ఫిక్స్ అయిందా.. అతను చెప్పిందే జరిగిందే?

praveen
బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ గురించి కొత్తగా పరిచయం చేస్తే అది అతిశయోక్తి అవుతుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే బాక్సింగ్ అనే ఆటలో మైక్ టైసన్ సాధించిన విజయాలు ఇక ప్రపంచవ్యాప్తంగా సంపాదించుకున్న గుర్తింపు అంతా కాదు. ప్రత్యర్ధుల వెన్నులో వణుకు పుట్టిస్తూ అలవోకగా విజయాలు సాధించడంలో మైక్ టైసన్ దిట్ట. అయితే ఆయన బాక్సింగ్ కి గుడ్ బై చెప్పేసి చాలా ఎళ్లే గడిచిపోయాయి. అయినప్పటికి ఆయన సాధించిన రికార్డుల గురించి ఇప్పటికీ కూడా ఎంతోమంది చర్చించుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

 అయితే ఇలా ఒకప్పుడు మనం చూసిన మెరుపులాంటి పిడుగుద్దుల వీరుడు ఇప్పుడు 58 ఏళ్లకు వచ్చి ముసలి అయిపోతూ ఉన్నాడు. ఇలాంటి సమయంలో మళ్ళీ అతని నుంచి బాక్సింగ్ మ్యాచ్ ఊహించడం  కూడా కష్టమే. అలాంటిది 58 ఏళ్ల వయసులో మైక్ టైసన్ మళ్లీ బాక్సింగ్ రింగ్ లోకి దిగేందుకు సిద్ధమయ్యాడు అన్న విషయం తెలిసిందే. 27 ఏళ్ల బాక్సర్ జేక్ పాల్ తో మళ్లీ పోరాడేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఈ మ్యాచ్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతల హాట్ టాపిక్ గా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ మళ్లీ బాక్సింగ్ రింగ్లో ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడో చూడటానికి అందరూ ఎదురుచూశారు. అయితే నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఈ మ్యాచ్లో ఇక బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ జేక్ పాల్ చేతిలో ఓడిపోయాడు. అయితే ఈ మ్యాచ్ కి సంబంధించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం వైరల్ గా మారిపోయింది. ఈ మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందే మైక్ టైసన్, జేక్ పాల్ మధ్య జరగబోయే బాక్సింగ్ మ్యాచ్ ముందుగానే ఫిక్స్ అయిందంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. మొదట్లో టైసన్ ఆదిక్యం ఉంటుందని.. ఇక నాలుగో రౌండు తర్వాత మెల్లగా టైసన్ నీరసించి ఓడిపోతారని.. జైపాల్ విజయం సాధిస్తారు అంటూ ఈ పోస్టులో సారాంశం ఉంది. అయితే ఇటీవల జరిగిన మ్యాచ్ లో కూడా ఇలాగే జరిగింది. రెండు రౌండ్ల వరకు ఆదిక్యంలో ఉన్న టైసన్ తర్వాత నిరసించిపోయి ఓడిపోయారు. దీంతో ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: