BGT లో ఎక్కువ రన్స్ చేసేది ఎవరు.. రికీ పాంటింగ్ ఏమన్నాడంటే?

praveen
టీమ్ ఇండియాకు చిరకాల ప్రత్యర్థిగా కొనసాగే టీం ఏది అంటే ప్రతి ఒక్కరూ పాకిస్తాన్ పేరు చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలపై నిషేధం కొనసాగుతూ ఉండడం.. ఎప్పుడూ సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో  ఇక ఈ రెండు దేశాల మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా కూడా ఉత్కంఠ మరో లెవెల్లో ఉంటుంది. అయితే పాకిస్తాన్ తర్వాత అటు భారత్ కి చిరకాల ప్రత్యర్థి లాంటి టీం ఏదైనా ఉంది అంటే అది ఆస్ట్రేలియా అని చెప్పాలి.

 ఈ రెండు టీమ్స్ మధ్య ఎప్పుడు ఏ ఫార్మాట్లో సిరీస్ జరిగిన ఏకంగా వరల్డ్ కప్ చూస్తున్నంత ఆసక్తిగా క్రికెట్ ప్రేక్షకులు మ్యాచ్ వీక్షిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా ఈ రెండు టీమ్స్ మధ్య జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అయితే ఇరు జట్లు ఏకంగా వరల్డ్ కప్ అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. ఈ సిరీస్లో విజయాన్ని ఎంతో గౌరవంగా కూడా భావిస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే గత కొన్నెళ్ల నుంచి కూడా అటు భారత జట్టే ఇలా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలుస్తూ వచ్చింది. కాగా ఇప్పుడు మరోసారి ఈ ప్రతిష్టాత్మకమైన టెస్టు సిరీస్ కు వేలయ్యింది. ఇప్పటికే బోర్డర్ గవాస్కర్  ట్రోఫీ ఆడేందుకు భారత జట్టు ఆస్ట్రేలియా గడ్డపై అడుగు పెట్టింది.

 ఈ క్రమంలోనే రెండు అగ్రశ్రేణి టీమ్స్ మధ్య జరగబోతున్న సమరంలో ఎవరు పైచేయి సాధించబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఇదే విషయంపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా స్పందిస్తున్నారు. టీమిండియాతో జరగబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా విజేతగా నిలుస్తుంది అంటూ ఆ దేశ మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. 3-1 తేడాతో ఆస్ట్రేలియా సిరీస్ ను కైవసం చేసుకుంటుంది అంటూ ధీమా వ్యక్తం చేశారు. స్టీవ్ స్మిత్ లేదంటే టీమిండియా ప్లేయర్ రిషబ్ పంత్ ఎక్కువ రన్స్ చేస్తారు అంటూ అంచనా వేశాడు. ఆస్ట్రేలియా బౌలర్ హేజిల్ వుడ్ ఎక్కువ వికెట్లు తీస్తాడు అంటూ రికీ పాంటింగ్ జోస్యం చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: