WTC ఫైన‌ల్ బ‌రిలో ఐదుజ‌ట్లు... ఏ జ‌ట్టుకు ఎన్ని అవ‌కాశాలంటే.. ?

RAMAKRISHNA S.S.
న్యూజిలాండ్తో జరిగిన మూడు టెస్టుల సిరీస్ లో టీమిండియా కు వైట్ వాష్‌ తప్పలేదు. అసలు ఈ సిరీస్ ప్రారంభానికి ముందు మూడు మ్యాచ్‌లు భారత్ కచ్చితంగా విజయం సాధించి న్యూజిలాండ్ను ఘోర పరాజయంతో ఇంటికి పంపుతుందని అందరూ అనుకున్నారు. కానీ మూడు మ్యాచ్లలోనూ ఇండియా ఓడిపోయింది. మూడో టెస్ట్లో విజయానికి చేరువైన భారత్ 25 పరుగులు  తేడాతో ఓట‌మి పాలయ్యింది. దీంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో టీమిండియా అగ్రస్థానం కోల్పోయింది. అంతేకాకుండా డబ్ల్యూటీసి ఫైనల్ అవకాశాలను మరింత కష్టం చేసుకుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 62.50 % తో టాప్లో ఉంది. భారత్ 58.33 - శ్రీలంక 50 5.56 - న్యూజిలాండ్ 54.55 - దక్షిణాఫ్రికా 54.17 % శాతంతో వరుసగా తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఈ ఐదు జట్లు డబ్ల్యూటీసి ఫైనల్ చేరడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఏ జట్టుకి ఎన్ని మ్యాచ్లు మిగిలి ఉన్నాయి, ఎన్ని విజయాలు సాధిస్తే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా ఫైనల్ చేరుతాయో ఓ లుక్క్‌ వేద్దాం.

ఆస్ట్రేలియా :
ప్రస్తుతం టేబుల్ లో అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా ఇంకా ఏడు టెస్టులు ఆడాల్సి ఉంది. అందులో స్వదేశంలో భారత్తో ఐదు టెస్టులు బార్డర్ - గవాస్కర్ ట్రోఫీ ఆడనుంది. తర్వాత రెండు టెస్టుల శిరీష్ కోసం శ్రీలంక పర్యటనకు వెళుతుంది ఆసీస్ ఈ ఏడు మ్యాచ్లో ఐదు విజయాలు సాధిస్తే ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా ఫైనల్ కు వెళుతుంది.
భారత్ :
భారత్ ఇంకా ఐదు మ్యాచ్లే ఆడాల్సి ఉంది. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో ఆసీస్ వేదికగా ఈ ఐదు మ్యాచ్‌లు భారత్‌కు సవాల్ గా మారింది. భారత్ ఫైనల్ కు చేరాలంటే కనీసం ఈ సిరీస్ ను 4 - 0 తో కైవసం చేసుకోవాలి.. అంటే నాలుగు మ్యాచ్‌ల్లో తప్పకుండా విజయం సాధించాలి. ఐదో మ్యాచ్లో గెలవకపోయినా కనీసం డ్రా అయిన చేసుకోవాలి. ఆసీస్‌ను సొంత గడ్డపై 4 - 0 తో ఓడించడం అంత తేలికైన విషయం కాదు.

శ్రీలంక :
శ్రీలంక ఇటీవల న్యూజిలాండ్ పై రెండు టెస్టుల సిరీస్ ను 2 - 0 తో కైవసం చేసుకుని అనూహ్యంగా ఫైనల్ రేసులోకి వచ్చింది. లంక ఇంకా నాలుగు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇందులో రెండు సౌత్ ఆఫ్రికా... రెండు శ్రీల‌కంతో స్వదేశంలో ఆడనుంది ఈ నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధిస్తే శ్రీలంక ఫైనల్ కి వెళుతుంది.
న్యూజిలాండ్ :
న్యూజిలాండ్ శ్రీలంక చేతిలో ఘోర ఓట‌మి చూసిన భారత్ తో టెస్ట్ సిరీస్ ను 3 - 0 తో కైవసం చేసుకుని ఫైనల్ రేసులోకి దూసుకు వచ్చింది. న్యూజిలాండ్ ఇంకా మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. నవంబర్లో ఇంగ్లాండ్‌తో మూడో టెస్టులు సీరిస్ ఆడాల్సి ఉంటుంది. ఈ మూడు ఖచ్చితంగా గెలిస్తే ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా న్యూజిలాండ్ ఫైనల్ కి వెళుతుంది.

సౌత్ ఆఫ్రికా :
బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ 2 - 0తో కైవ‌సం చేసుకున్న ఈ జట్టు టాప్ ఫైవ్లోకి వచ్చింది. వీళ్ళు ఇంకా నాలుగు టెస్టులు వాడాల్సి ఉంది.. శ్రీలంక - పాకిస్తాన్ తో రెండేసి టెస్టులు ఆడనున్న దక్షిణాఫ్రికా ఈ నాలుగు మ్యాచ్లలో తప్పక విజయం సాధిస్తే ఫైనల్ కు వెళుతుంది. అయితే ఈ నాలుగు మ్యాచ్‌ల్లోనూ స్వదేశంలో జరుగుతుండటం సౌత్ ఆఫ్రికాకు కలిసి వచ్చే అంశం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: