విరాట్‌ కోహ్లిని వెనక్కి నెట్టిన అజయ్‌ జడేజా... ఎందులోనో తెలుసా?

praveen

అవును, మీరు విన్నది నిజమే. విరాట్‌ కోహ్లిని సైతం అజయ్‌ జడేజా ఆ విషయంలో వెనక్కి నెట్టడంతో ప్రస్తుతం నెట్టింట ఆ విషయం హాట్ టాపిక్ అయింది. గుజరాత్ మాజీ రాజ కుటుంబానికి చెందిన రాజా శత్రుశల్యసింగ్ జడేజా తన అల్లుడు, మాజీ క్రికెటర్ అజయ్ జడేజాను తన రాజ్యానికి వారసుడిగా ప్రకటించడంతో ఈ ఘనత చోటుచేసుకుంది మరి! భారత క్రికెట్ చరిత్రలో రంజీ, దులీప్ ట్రోఫీలకు చాలా ముఖ్యమైన స్థానం ఉన్న సంగతి విదితమే. ఈ టోర్నమెంట్‌లకు పేరు పెట్టబడిన గొప్ప ఆటగాళ్లు నేరుగా గుజరాత్‌లోని జామ్‌నగర్ రాజ కుటుంబానికి చెందినవారే ఎక్కువగా ఉంటారు.
ఇపుడు ఇదే రాజకుటుంబం, వీరి ప్రస్తుత వారసుడు భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజాకి రాజ కుటుంబ‌ సింహాసనాన్ని అప్పగిస్తున్నట్లు జామ్‌నగర్ రాజకుటుంబం ఇటీవల ప్రకటించింది. దీంతో అంతర్జాతీయ క్రికెట్ లో అజయ్ జడేజా ప్రత్యేక స్థానం సంపాదించినట్టు అయింది. కట్ చేస్తే, ప్రపంచ క్రికెట్లో అత్యంత ధనవంతుడైన క్రికెటర్ గా  లెజెండరీ ప్లేయర్ల వెనక్కి నెట్టి టాప్ లోకి వచ్చాడు అజయ్ జడేజా. ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక ఆస్తులున్న క్రికెటర్ పేర్లను ప్రస్తావిస్తే ఎక్కువగా వినిపించే పేర్లు విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని మనకి వినబడతాయి. ఇందులో విరాట్ కోహ్లీ దాదాపు 1090 కోట్ల రూపాయల ఆస్తితో ధనవంతులైన క్రికెటర్లలోఒకరిగా ఉన్నారు. ప్రస్తుతం భారీగా సంపాదనలో ఉన్న టాప్ ప్లేయర్ ఈయనే.
అయితే ప్రస్తుతం ఒక నివేదిక ప్రకారం అజయ్ జడేజా ఆస్తుల విలువ కోహ్లీ, ధోనీ, సచిన్ టెండూల్కర్ ప్రస్తుత ఆస్తుల కంటే చాలా రెట్లు పెరిగిందని తెలుస్తోంది. మహారాజా అయిన తర్వాత జడేజా ఆస్తుల విలువ దాదాపు 1445 కోట్ల రూపాయలకు చేరుకున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే, భారతదేశంలోని దేశీయ క్రికెట్‌లో రెండు టోర్నమెంట్‌లు ఈ ఇద్దరు మాజీ రాజుల పేరు మీదనే ఉండటం విశేషం. అజయ్ జడేజా ఆ 83 ఏళ్ల శత్రుశల్యసింగ్ స్థానంలో మహరాజుగా బాధ్యతలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: