టీ20 సిరీస్‌పై టీమిండియా కన్ను.. సూర్యకుమార్ యాదవ్ రికార్డు సొంతం చేసుకోనున్నాడా ..?

praveen
టీమిండియా తొలి టి20 మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై టీమిండియా విజయం సొంతం చేసుకున్న సంగతి అందరికీ విధితమే. గ్వాలియర్‌ లోని మాధవరావ్ సింధియా క్రికెట్ స్టేడియం వేదికగా టీమిండియా తరఫున కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ వహించిన సంగతి కూడా అందరికి విధితమే.. ఇక మ్యాచ్ లో భాగంగా బంగ్లాదేశ్ ను బ్యాటింగ్ లో కట్టడి చేసేందుకు టీమ్ ఇండియా బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ఇక కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో (27)ను అవుట్ చేయడంలో వాషింగ్టన్ సుందర్ సఫలమయ్యాడు. కాగా, మెహదీ హసన్ మిరాజ్ 32 బంతుల్లో అజేయంగా 35 పరుగులు చేసి జట్టు స్కోరును 100కు చేర్చాడు. అలా చివరకు బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 127 పరుగులు తీసి ఆల్ అవుట్ అయ్యింది.
మన టీమ్ ఇండియా తరపున అర్ష్‌దీప్ సింగ్ 3.5 ఓవర్లలో 14 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా, వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో 31 పరుగులిచ్చి 3 వికెట్లు తీశారు. ఇక 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ప్లేయర్స్ అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. తొలి మ్యాచ్ లోనే భారత జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సొంతం చేసుకోవడంతో టీమిండియా ప్లేయర్స్ అందరూ ఆనందంలో ఉన్నారు. ప్రస్తుతం టి20 సిరీస్ లలో తొలి మ్యాచ్లో టీమిండియా 1 - 0 ఆదిత్యంలో నిలవగా.. రెండో మ్యాచ్ అక్టోబరు 9 న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో జరగబోతూ ఉండగా.. ఈ మ్యాచ్ లో కూడా టీమిండియా విజయం సాధిస్తే సిరీస్ సొంతం  చేసుకోవచ్చని ప్లాన్ చేస్తోంది. చూడాలి మరి సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరించి విజయం పైపు టీమిండియా లో తీసుకొని వెళ్తాడో లేదో మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: