ఐపీఎల్‌ రిటెన్షన్ రూల్స్ వచ్చేశాయ్..5+1 RTM కార్డ్..?

Veldandi Saikiran
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది. ఐపీఎల్ రిటెన్షన్ విధానం పై... నిబంధనలను ఫైనల్ చేసింది బీసీసీఐ పాలకమండలి. డిసెంబర్ లేదా నవంబర్ చివర్లో... మెగా వేలం జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఐపిఎల్ రిటెన్షన్ నిబంధనలను ఫైనల్ చేసింది. ఈసారి 10 జట్లకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటూ బిసిసిఐ...విధివిధానాలను ఖరారు చేసింది.
 

ఇక ఐపీఎల్ రిటెన్షన్ నిబంధనలు ఒకసారి పరిశీలించినట్లయితే... ఈసారి అన్ని ఫ్రాంచైజీల పర్సు వేల్యూ 120 కోట్లకు పెంచేసింది. అంతేకాదు అన్ క్యాప్డ్ ప్లేయర్గా... చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని తన పాత్ర పోషించనున్నాడు. అలాగే ఫ్రాంచైజీలతో ఒప్పందం చేసుకున్న ఆటగాళ్లు 2027 వరకు కచ్చితంగా ఐపిఎల్ ఆడాల్సిందే. లేకపోతే వాళ్లపై వేటు పడుతుంది.

ఇక రిటెన్షన్ లో భాగంగా ఆరుగురుని రిటైన్ చేసుకునే అవకాశం బీసీసీఐ కల్పించడం జరిగింది. రిటైన్ చేసుకునే ఆరుగురు ఆటగాళ్లలో కచ్చితంగా అన్ క్యాప్డ్ ప్లేయర్ ఉండాలని ఒకసారి కొత్త రూల్ తీసుకువచ్చింది బీసీసీఐ. ముఖ్యంగా... గరిష్టంగా ఇద్దరు అన్ క్యాప్డ్ ప్లేయర్లకు ఛాన్స్ ఇచ్చేందుకు... నిర్ణయం తీసుకుంది.  
అంతేకాకుండా రిటైన్ లిస్టులో విదేశీ ప్లేయర్లకు ఎలాంటి... పరిమితులు లేదని కూడా బీసీసీఐ పాలకమండలి ప్రకటించడం జరిగింది. ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొనే విదేశీ ఆటగాళ్లు ముందుగా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ మాత్రం చేసుకోవాల్సిందిగా కోరింది.


లేకపోతే వేలంలో పాల్గొనే అవకాశాలు ఉండబోవు అని కూడా తెలిపింది. రిజిస్టర్ చేసుకోకపోతే మినీ వేలంలో పాల్గొనే అవకాశం కూడా లేదని స్పష్టం చేయడం జరిగింది.  ఐదుగురు ఆటగాలను రిటైన్ చేసుకుంటే 75 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. అంతేకాదు అన్ కేబుల్ ప్లేయర్కు నాలుగు కోట్లుగా నిర్ణయం తీసుకుంది బీసీసీఐ పాలకమండలి. అంటే పర్స్ వ్యాల్యూలో 120 కోట్లు ఉంటే.. రిటెన్షన్కు 75 కోట్లు... మిగిలిన 45 కోట్లు వేలానికి వాడుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: