ప్చ్.. రోహిత్ భయ్యా ఏంటిది.. మళ్లీనా?

praveen
ప్రస్తుతం భారత జట్టు బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ టెస్ట్ సిరీస్ ఆడేందుకు బంగ్లా టీం భారత పర్యటనకు వచ్చింది. కాగా ఇటీవల మొదటి టెస్ట్ మ్యాచ్ కూడా ప్రారంభమైంది అని చెప్పాలి. కాగా ఇక ఈ మొదటి టెస్ట్ మ్యాచ్లో బంగ్లా జట్టుపై అటు టీమిండియా విజృంభిస్తుంది. పూర్తిస్థాయి ఆదిపత్యాన్ని కొనసాగిస్తుంది అని చెప్పాలి. అటు బంగ్లా బౌలర్లని టీమిండియా బ్యాట్స్మెన్లు చెడుగుడు ఆడేస్తూ ఉంటే.. టీమిండియా బౌలింగ్ విభాగం బంగ్లా బ్యాటింగ్ విభాగాన్ని పేక మేడల కూల్చేస్తుంది.

 అయితే ఇలా మొదటి టెస్ట్ మ్యాచ్లో బంగ్లా జట్టుపై అటు టీమిండియా ఊహించినట్లుగానే అద్భుతమైన ప్రదర్శన చేస్తూ పైచేయి సాదిస్తూ ఉంటే అటు కొంతమంది కీలక ప్లేయర్ల ఆట తీరు మాత్రం అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది అని చెప్పాలి. మరీ ముఖ్యంగా జట్టు లో కీలక ప్లేయర్గా జట్టు కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ.. వరుసగా రెండు ఇన్నింగ్స్ లలో కూడా విఫలమయ్యాడు. మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 6 పరుగులకు మాత్రమే వికెట్ సమర్పించుకున్న రోహిత్ శర్మ రెండో ఇన్నింగ్స్ లోను ఇదే చేశాడు.

 రెండో ఇన్నింగ్స్ లో అయినా రోహిత్ అద్భుతమైన బ్యాటింగ్ చేస్తాడు అని అనుకుంటే.. ఇక రెండో ఇన్నింగ్స్  లోను సింగిల్ డిజిట్ స్కోర్ కే పరిమితమయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో ఆరు పరుగులు చేసిన హిట్ మాన్ రెండో ఇన్నింగ్స్ లో కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి పెవెలియన్ చేరాడు. మొదటి ఇన్నింగ్స్ లో రోహిత్ ను అవుట్ చేసిన యంగ్ బౌలర్ తస్కిన్ అహ్మద్ ఇక రెండో ఇన్నింగ్స్ లోను అవుట్ చేశాడు  దీంతో అభిమానులు అందరూ కూడా ఎంతగానో నిరాశ చెందారు అని చెప్పాలి. అయితే చిన్న జట్టుపై తక్కువ స్కోరుకే రోహిత్ ఔట్ కావడంతో.. అసలు హిట్ మ్యాన్ కి ఏమైంది అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: