మనల్ని ఎవడ్రా ఆపేది.. కోహ్లీ ఆ రికార్డు కూడా కొట్టేసాడు?

praveen
విరాట్ కోహ్లీ ఈ పేరు వినిపిస్తే చాలు ప్రత్యర్ధులకు హడల్. ఇతను గ్రీజులో ఉన్నాడు అంటే చాలు అటు ప్రత్యర్ధులందరిలో  ఓటమి భయం వెంటాడుతూనే ఉంటుంది. ఎందుకంటే ఈ ఒక్కడు మ్యాచ్ ని గెలిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందరూ వికెట్లు కోల్పోతున్న ఈ ఒక్కడు నిలబడి ఇక ప్రత్యర్ధులను వణికించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే విరాట్ కోహ్లీని ఈ తరానికి లెజెండ్ గా పిలుచుకుంటూ ఉంటారు మాజీ ప్లేయర్లు, క్రికెట్ విశ్లేషకులు. అయితే ఇక అభిమానులు అయితే విరాట్ కోహ్లీని క్రికెట్ కింగ్ అని అంటూ ఉంటారు.

 ఎవరో పొగడటం కాదు.. విరాట్ కోహ్లీ ఆడిన ప్రతిసారి కూడా తన సత్తా ఏంటో నిరూపిస్తూనే ఉంటాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి దశాబ్దన్నర కాలం గడిచిపోతుంది. ఇప్పటికే ఒక క్రికెటర్ గా ఎంత నిరూపించుకోవాలో అంతకంటే ఎక్కువగానే నిరూపించుకున్నాడు. ఎన్నో అరుదైన రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ ఇంకా రికార్డుల వేట కొనసాగిస్తూనే ఉన్నాడు. ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా తనను ఎందుకు రికార్డులు రారాజు అంటారు అన్న విషయాన్ని కొత్త రికార్డులు బద్దలు కొడుతు ప్రతిసారీ నిరూపిస్తూనే ఉన్నాడు. అలాంటి విరాట్ కోహ్లీ ఇప్పుడు మరో రికార్డు కూడా దాసోహం అయిపోయింది.

 ఇటీవల టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఒక అరుదైన ఘనత సాధించాడు. సొంత గడ్డపై అత్యధిక పరుగులు పూర్తి చేసుకున్న ఐదవ బ్యాట్స్మెన్ గా రికార్డు సృష్టించాడు. బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో ఆయన ఏకంగా 12,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఇక ఈ లిస్టులో టాప్ ప్లేస్ లో భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ 14,192 పరుగులతో ఉన్నాడు. ఆ తర్వాత రికీ పాంటింగ్ 13117, జాక్వస్ కలిజ్ 12305, సంఘకర 12043 పరుగులతో కోహ్లీ కంటే ముందున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: