టి20 వరల్డ్ కప్.. ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడంటే?

praveen
టి20 ఫార్మట్ లో మ్యాచ్ జరుగుతుంది అంటే చాలు ప్రేక్షకులకు ఎక్కడ లేని ఆసక్తి వచ్చేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే క్రికెట్ ను ఇష్టపడే ప్రేక్షకులు అందరికీ కావాల్సిన బ్యాటింగ్ మెరుపులు బౌలింగ్ ఉరుములు అన్ని కూడా టి20 ఫార్మాట్లో కనిపిస్తూ ఉంటాయి. అందుకే ఇటీవల కాలంలో ఈ ఫార్మాట్ కి వరల్డ్ క్రికెట్లో కూడా అంతకంతకు క్రేజ్ పెరిగిపోతోంది అని చెప్పాలి. అలానే టి20 ఫార్మాట్లో వరల్డ్ కప్ జరిగితే ఇక ఉత్కంఠ ఏ లెవెల్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 కాగా మరికొన్ని రోజుల్లో ఇలాంటి ఉత్కంఠ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. అక్టోబర్ మూడవ తేదీ నుంచి మహిళల టి20 ప్రపంచ కప్ జరగబోతుంది. అయితే ఇక ఈ టి20 ప్రపంచ కప్ కు సంబంధించిన షెడ్యూల్ ఇటీవల icc సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. తొలుత ఈ ప్రపంచకప్ టోర్నీని  బంగ్లాదేశ్లో నిర్వహించాల్సి ఉంది. కానీ అక్కడ పరిస్థితులు ప్రస్తుతం క్షీణించడంతో ఇక వరల్డ్ కప్ ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు మార్చారు. ఈ క్రమంలోనే ప్రపంచ కప్ మ్యాచ్లు అన్నీ కూడా షార్జా క్రికెట్ స్టేడియంలో జరుగుతాయట.

 అక్టోబర్ మూడవ తేదీ నుంచి ఈ ప్రపంచకప్  ప్రారంభం కాబోతుండగా మొదటి మ్యాచ్లో స్కాట్లాండ్ బంగ్లాదేశ్ జట్లు తలపడతాయట. అయితే ఇక ఈ ప్రపంచ కప్ లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు అన్న విషయాన్ని తెగ వెతికేస్తూ ఉన్నారు క్రికెట్ ప్రేక్షకులు. అయితే అక్టోబర్ 4వ తేదీన భారత్ మొదటి మ్యాచ్ న్యూజిలాండ్తో ఆడబోతుంది టీమిండియా. ఆ తర్వాత అక్టోబర్ 6న ఇండియా, పాకిస్తాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది అని చెప్పాలి. కాగా అక్టోబర్ 3న ప్రారంభమయ్యే ఈ ప్రపంచకప్ టోర్ని అక్టోబర్ 20 వరకు జరుగుతుంది. మొత్తంగా ఈ వరల్డ్ కప్ టోర్నీలో 23 మ్యాచ్ లు జరగబోతున్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: