IPL 2025: ఈ ముగ్గురు ప్లేయర్లకు రూ.600 కోట్లు ?

frame IPL 2025: ఈ ముగ్గురు ప్లేయర్లకు రూ.600 కోట్లు ?

Veldandi Saikiran
భారత క్రికెటర్లు ఐపీఎల్ ద్వారా భారీగానే డబ్బులను సంపాదిస్తున్నారు. ఇది గణనీయమైన ఆదాయ వనరుగా మారుతుంది. 2008 నుండి 2024 వరకు చాలామంది ప్లేయర్లు జాతీయ జట్టులోకి రాకపోయినప్పటికీ అక్కడ అద్భుత ప్రదర్శన చూపించి కాసుల వర్షం కురిసేలా చేస్తున్నారు. ఇప్పటివరకు సాగిన ఐపీఎల్ అన్ని సీజన్లను కనుక గమనించినట్లయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీలు అత్యధికంగా జీతాలు పొందిన ప్లేయర్లుగా ముందు వరసలో ఉన్నారు.

భారత జట్టులోని ఈ ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు 2008 నుండి 2024 వరకు ప్రతి ఐపిఎల్ సీజన్ లోను ఆడి గ్రౌండ్ లో సంచలనాలు సృష్టించారు. ఈ 17 సంవత్సరాల్లో వారి అద్భుతమైన ఆట తీరుతో అత్యధికంగా జీతాలను స్వీకరించారు.  ప్రస్తుత భారత జట్టు కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 2011 నుండి ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ లో అద్భుతంగా రాణిస్తున్నారు. ముంబై ఇండియన్స్ కు ఐదు ట్రోఫీలు అందించిన తొలి కెప్టెన్ గా రికార్డులు సృష్టించాడు. సూపర్ ఫేమ తో పాటు ఐపీఎల్ లో తన 17 సీజన్లలో రోహిత్ శర్మ రూ. 178.6 కోట్ల భారీ మొత్తంలో డబ్బులను సంపాదించాడు.

ఐపీఎల్ లో అత్యధిక వేతన సంపాదన కలిగిన రెండో ప్లేయర్ గా చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని నిలిచారు. అయితే ధోని చెన్నై టీం తరఫున ఆడుతూ మొత్తం రూ. 176.8 కోట్ల డబ్బులను సంపాదించడం జరిగింది. అటు 2008 నుండి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న విరాట్ కోహ్లీ వేలానికి కనుక వెళ్లి ఉంటే పెద్ద సంచలనమే సృష్టించేవాడు. అయితే విరాట్ కోహ్లీ ఎప్పుడు వేళానికి వెళ్లలేదు. అయినప్పటికీ విరాట్ కోహ్లీకి ఐపీఎల్ నుంచి 17 సంవత్సరాల్లో మొత్తం రూ. 173.2 కోట్ల డబ్బులను సంపాదించాడు. ఇక వీరు మాత్రమే కాకుండా ఐపీఎల్లో ఆడుతున్న చాలామంది ప్లేయర్లు భారీగానే డబ్బులను సంపాదించి సంచలనాలు సృష్టిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: