అలా చేయకపోతే.. కోహ్లీ సిగ్గుపడాలి : హార్భజన్

praveen
సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్లో ఎన్ని రకాల ఫార్మాట్లు ఉన్నప్పటికీ ప్రేక్షకులందరూ అమితంగా ఇష్టపడే ఫార్మాట్ ఏదైనా ఉంది అంటే అది టెస్ట్ ఫార్మాట్ అని చెప్పాలి. సాంప్రదాయమైన క్రికెట్ గా పిలుచుకునే టెస్ట్ ఫార్మాట్లో ఎప్పుడు అత్యుత్తమ గణాంకాలు నమోదు చేయాలని అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన ప్రతి ప్రేయర్ కూడా ఆశపడుతూ ఉంటాడు. అదే సమయంలో ఈ సుదీర్ఘమైన ఫార్మాట్లో ఎక్కువ కాలం పాటు కెరీర్ కొనసాగించాలని అనుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

 ఒక రకంగా చెప్పాలంటే టెస్ట్ ఫార్మాట్ ప్రతి ఆటగాడి ప్రతిభకు సవాల్ విసురుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక గంటల తరబడి మైదానంలో ఆట ఆడాల్సి ఉంటుంది. అందుకే ఇక కేవలం ఫిట్నెస్ ఉన్న ఆటగాళ్లు మాత్రమే టెస్ట్ ఫార్మాట్ లో రాణించగలరు. అందుకే ఎంతోమంది ఆటగాళ్లు ఈ ఫార్మాట్లోకి వచ్చిన.. కొంతమంది మాత్రమే అత్యుత్తమ ప్రదర్శన చేసి ఎక్కువ కాలం కెరీర్ ని కొనసాగిస్తూ ఉంటారు. ఇక ఈ తరంలో సాంప్రదాయ క్రికెట్ గా పిలుచుకునే టెస్ట్ ఫార్మాట్లో అత్యుత్తమంగా రాణించిన ప్లేయర్లు ఎవరు అంటే మాత్రం విరాట్ కోహ్లీ అని చెబుతారు అందరూ.

 ఎందుకంటే ఇప్పటివరకు అత్యుత్తమ బ్యాటింగ్ తో ఎన్నో అరుదైన రికార్డులు కూడా నమోదు చేశాడు విరాట్ కోహ్లీ. కోహ్లీ ఇప్పటివరకు తన కెరీర్ లో 113 టెస్టులు ఆడి 8848 పరుగులు చేశాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతను పదివేల పరుగులు పూర్తి చేయాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఇదే విషయం ప్రతి స్పందించిన టీమిండియా మాజీ క్రికెటర్ హార్భజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో పదివేల పరుగులు పూర్తి చేయకపోతే.. రన్ మిషన్ విరాట్ కోహ్లీ సిగ్గుపడాలని చెప్పినట్లు హర్భజన్ గుర్తు చేశాడు. టెస్టుల్లో వెస్టిండీస్ పై విరాట్ అరంగేట్రం చేసిన సమయంలో అతనితో మాట్లాడినట్లు తెలిపారు. ఒకవేళ కోహ్లీ 10000 పరుగులు పూర్తి చేయకపోతే అది అతని తప్పే అవుతుంది అంటూ హర్భజన్ పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: