ఎంపైర్ గా మారబోతున్న MS ధోనీ....?

Veldandi Saikiran

మహేంద్రసింగ్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచ క్రికెట్ లోనే అత్యుత్తమ కెప్టెన్ గా రికార్డును నమోదు చేసుకున్నాడు. భారత జట్టును మూడు ఫార్మాట్ల నుంచి నంబర్ వన్ గా నిలబెట్టి తన సత్తాను చాటుకున్నాడు. మూడు ఫార్మాట్లలో భారత జట్టుకు మూడుసార్లు ఐసీసీ ట్రోఫీలను అందించిన కెప్టెన్ గా నిలిచాడు. మిస్టర్ కూల్ గా గుర్తింపు పొందిన ధోని క్రికెట్ చరిత్రలో ఎన్నో అద్భుతమైన రికార్డులను నెలకొల్పాడు.


అయితే ధోని క్రికెట్ లో మంచి గుర్తింపుతో పాటు వేలకోట్ల రూపాయలను కూడా సంపాదించాడు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ తీసుకొని దాదాపు నాలుగు సంవత్సరాలకు పైనే అవుతున్నప్పటికీ ధోని క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ ఐపీల్ లో ఆడుతూ యంగ్ ప్లేయర్లకు గట్టి పోటీని ఇస్తాడు. ఇదిలా ఉండగా.... ధోని ఐపిఎల్ కు గుడ్ బై చెబితే ఆ తర్వాత ఏం చేస్తాడు.... అతడి ప్లాన్ ఏంటి.... అనేది పెద్ద చర్చగా మిగిలిపోయింది.


ఈ విషయంలో ప్రముఖ అంపైర్ అనిల్ చౌదరి చేసిన కొన్ని వాక్యాలు వైరల్ అవుతున్నాయి. ధోని కావాలనుకుంటే ఒక మంచి అంపైర్ అవుతాడని అనిల్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది నేషన్ గా మారుతున్నాయి. ధోని రివ్యూలకు ప్రతిసారి సానుకూల నిర్ణయాలు ఉండవు. ధోని అంచనాలు మాత్రం వాస్తవాలకు ఏ మాత్రం తీసుకొని విధంగా ఉంటాయి. ధోని తన చేతులతో టీ సింబల్ చూపించాడు అంటే స్టేడియంలో పెద్ద చర్చ జరుగుతోంది.


ధోనికి ఆట విషయంలో అద్భుతమైన అవగాహన ఉంటుంది. చాలా సందర్భాల్లో ఇతరులు అనవసరంగా ఆప్పీల్ చేయకుండా కూడా ధోని అడ్డుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ధోని ఏడు గంటల పాటు మైదానంలో ఉండడానికి రెడీ అంటే ఒక మంచి అంపైర్ అవుతాడు. ఈ విషయంలో ధోని ఏమైనా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడేమో చూడాలని అనిల్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: