55 బంతుల్లో 165.. ఏం కొట్టుడు కొట్టాడు సామీ.. వీడియో వైరల్?

praveen
ఇండియాలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ దృశ్య ఈ మధ్యకాలంలో ఎంతోమంది యువకులు క్రికెట్ నే ప్యాషన్ గా మార్చుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత క్రికెట్ లో కొత్త ప్రతిభకు కొదవ లేకుండా పోయింది. భారత జట్టులో చోటు సంపాదించాలి అనే కసితో ఉంటున్న ఎంతోమంది యువ ఆటగాళ్లు తమ ఆట తీరుతో అందరిని ఆశ్చర్యపరుస్తు ఉన్నారు. ఇక వచ్చిన ఏ అవకాశాన్ని వదలకుండా అదరగొట్టేస్తున్నారు అని చెప్పాలి.

 అయితే ఇప్పటివరకు భారత జట్టులో ఛాన్స్ దక్కించుకోని ఆటగాళ్ళు ఇక టీమిండియా జెర్సీ వేసుకునేందుకు.. ఇక ఇప్పటికే టీమ్ ఇండియాలో ఛాన్స్ దక్కించుకున్న ఆటగాళ్లు తమ స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు కష్టపడుతున్నారు. ఇలా  ఐపీఎల్ సహా దేశవాళి క్రికెట్లో కూడా అదరగొడుతూ భారత జట్టులో చోటు సంపాదించుకున్న ఆటగాళ్లలో ఆయుష్ బదోని కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. ఇక ఏడాది జరిగిన ఐపిఎల్ అదరగొట్టిన ఇతగాడు.. భారత జట్టులో కూడా ఛాన్స్ దక్కించుకొని.. అదే రీతిలో ఆటను కొనసాగించాడు. ఇక ఇప్పుడు ఏకంగా బ్యాటింగ్ విధ్వంసం అంటే ఎలా ఉంటుందో చూపించాడు.
 అతను కొట్టే కొట్టుడుకి ఏకంగా బౌలర్లు సైతం బెంబేలెత్తిపోయారు అని చెప్పాలి. స్కోర్ బోర్డు సైతం ఆయాసం వచ్చేలా పరుగులు పెట్టింది. ఢిల్లీ t20 ప్రీమియర్ లీగ్ లో భాగంగా సౌత్ ఢిల్లీ కెప్టెన్ అయిన ఆయుష్ బదోని 55 బంతుల్లో 165 పరుగులు చేశాడు. 19 సిక్సర్లతో టి20 లో ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్ గా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు గేల్ (18) పేరిట ఉండేది. అలాగే t20 ఫార్మాట్లో ఇది మూడో అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం గమనార్హం. బ్యాటింగ్ విధ్వంసంతో ఈ మ్యాచ్లో 308/5 స్కోరు చేసిన సౌత్ ఢిల్లీ జట్టు.. నార్త్ ఢిల్లీ టీం పై 112 పరుగులు తేడాతో ఘన విజయాన్ని అందుకుంది అని చెప్పాలి. కాగా ఆయుష్ బదోని బ్యాటింగ్ విధ్వంసానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: