రోహిత్ కు రూ. 50 కోట్లు.. LSG ఓనర్ ఏమన్నాడో తెలుసా?
ఈ క్రమంలోనే ఒకవేళ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ ను కాదని బయటికి వస్తే.. ఇక అతన్ని సొంతం చేసుకునేందుకు ఐపీఎల్ లోనే అన్ని ఫ్రాంచైజీలు కూడా తీవ్రంగా పోటీపడే అవకాశం ఉంది అంటూ అటు క్రికెట్ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. మరియు ముఖ్యంగా లక్నో జట్టు మొదటి టైటిల్ గెలుచుకోవడానికి ఆశగా ఉందని దీంతో తప్పకుండా రోహిత్ లాంటి కెప్టెన్ కావాలని కోరుకుంటుందని అతని కోసం ఎంత ధర పెట్టడానికైనా సిద్ధంగా ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఏకంగా 50 కోట్లు పెట్టి మరి రోహిత్ ను దక్కించుకోవాలని లక్నో ప్రణాళికలను సిద్ధం చేసుకుంది ఒక టాక్ వైరల్ గా మారింది.
అయితే ఇలాంటి వార్తలపై లక్నో జట్టు ఓనర్ సంజీవ్ గోయంక స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శాలరీ క్యాప్ లో ఒక ఆటగాడికే సగం డబ్బులు ఖర్చు చేస్తే.. మిగతా 22 మంది ఆటగాళ్ళను ఎలా కొనాలి. అసలు రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ వదిలేస్తుందో లేదో తెలియదు. వేలానికి వస్తారో రారో అనే విషయంపై కూడా క్లారిటీ లేదు. అలాంటప్పుడు కేవలం ఒక రోహిత్ కోసమే 50 కోట్లు లక్నో కేటాయించబోతుంది అని వస్తున్న వార్తలు కేవలం ఊహాగానం మాత్రమే అంటూ సంజీవ్ గోయెంకా క్లారిటీ ఇచ్చారు. దీంతో ఇక రోహిత్ మళ్లీ ఏ టీంలోకి వెళ్ళబోతున్నాడు అనే విషయంపై చర్చ మరింత తీవ్రతరం అయ్యింది అని చెప్పాలి.