చరిత్ర సృష్టించిన 5 ఏళ్ళ పిల్లాడు.. నిజంగా అసమాన్యుడే?

praveen
ఈ మధ్యకాలంలో పిల్లలను చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం లో మునిగిపోతున్నారు. ఎందుకంటే ఒకప్పుడు ఆడుకోవడం తప్ప ఇంకేమీ తెలియని వయసులో.. ఇప్పుడు పిల్లలు మాత్రం ఏకంగా అద్భుతాలే సృష్టిస్తూ ఉన్నారు. ప్రపంచ రికార్డులు సైతం సాధిస్తూ అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నారు. పిట్ట కొంచెం కూతగనం అనే సామెతకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తూ ఉన్నారు నేటి రోజుల్లో ఎంతోమంది  చిన్నారులు. ప్రతిరోజు స్కూల్ కు వెళ్లి వచ్చి తోటి పిల్లలతో సరదాగా ఆడుకోవాల్సిన వయస్సులో రికార్డులు కొట్టేస్తున్నారు.

 ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోపోయేది కూడా ఇలాంటి ఒక అసమాన్యూడైన ఐదేళ్ల చిన్నారి గురించి. సాధారణంగా అయిదేళ్ల వయసులో ఎవరైనా ఏం చేస్తారు. ఆ వయసులో ఉన్నప్పుడు ఏకంగా పిల్లలు స్కూల్కు వెళ్లడానికే మారం చేస్తూ ఉంటారు. దీంతో తల్లిదండ్రులు రెండు తగిలించి ఇలా ఏడుస్తున్న పిల్లల్ని లాక్కెళ్ళి మరి స్కూల్ బస్సులో వేయడం చూస్తూ ఉంటాం. ఇలా స్కూలుకు వెళ్లి రావడం ఇక స్కూల్ అయిపోయాక పిల్లలతో ఆడుకోవడం. ఇదే ఐదేళ్ల పిల్లాడి డైలీ రొటీన్ గా ఉంటుంది. కానీ ఇక్కడ ఐదేళ్ల పిల్లాడు మాత్రం తాను అసాధ్యుడిని అన్న విషయాన్ని నిరూపించాడు.

 తోటి పిల్లల తో సరదాగా ఆడుకోవాల్సిన వయస్సు లో.. ఏకంగా చరిత్ర సృష్టించాడు. పంజాబ్ రోఫర్ కు చెందిన ఐదేళ్ల పిల్లాడు తేగ్ బీర్ సింగ్ సాహసం చేశాడు. టాన్జానియాలో ఉన్న ఆఫ్రికాలోని ఎత్తైన 5895 మీటర్ల మౌంట్ కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించాడు. ఐదు రోజుల్లోనే పీక్ పాయింట్ కు చేరుకున్నాడు. తద్వారా ఆసియాలోనే అత్యంత పిన్న వయస్కుడిగా ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. నేను ఎక్కడికి చేరుకోవాలో నాకు తెలుసు. చివరికి దాన్ని చేరుకున్నాను. ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది అంటూ ఈ ఐదేళ్ల పిల్లాడు చెబుతూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: