వన్డేలో ఒక్కసారి కూడా డకౌట్ కానీ క్రికెట్ వీరుడు.. ఎవరో తెలిస్తే..?

praveen
ఇంటర్నేషనల్ క్రికెటర్లు ఇప్పటికే ఎన్నో రికార్డులు సృష్టించారు. ఎప్పటికప్పుడు కొత్త రికార్డులను కూడా క్రియేట్ చేస్తున్నారు ఆల్రెడీ ఉన్నారు రికార్డులను బద్దలు కొడుతున్నారు. కానీ కొందరు క్రికెటర్లు నెలకొల్పిన కొన్ని రికార్డ్స్ మాత్రం ఎవరూ టచ్ చేయలేరు. ముఖ్యంగా కెప్లర్ వెసెల్స్ అనే ఒక మాజీ ఆటగాడు క్రియేట్ చేసిన ఒక అరుదైన అవార్డును ఇప్పటిదాకా ఎవరూ కూడా బ్రేక్ చేయలేకపోయారు. కెప్లర్ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా టీమ్స్‌లో ఓపెనర్ గా ఇతడు దిగేవాడు. బౌలర్లను గడగడ లాడించేవాడు.
 తన ODI కెరీర్ మొత్తంలో ఒక్కసారి కూడా డకౌట్ కాలేదంటే ఇతడు ఎంత స్ట్రాంగ్ ప్లేయరో అర్థం చేసుకోవచ్చు. ఒకసారి కూడా సున్నాకి అవుట్ కాలేదు కాబట్టి ఆ ఘనత రెండు దేశాలకు పేరిటా నమోదయింది. ఇంటర్నేషనల్ క్రికెటర్‌ను ODIలో ఏ బౌలర్ కూడా జీరో కే అవుట్ చేయలేకపోవడం ఆశ్చర్యకరమైన చెప్పుకోవచ్చు. కెప్లర్ 1983 నుంచి ఆస్ట్రేలియా తరపున వన్డే మ్యాచ్‌లు ఆడటం మొదలుపెట్టాడు. తరువాత సౌత్ ఆఫ్రికన్ టీమ్‌లో చేరి ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లు ఆడుతూ రాణించాడు. 1994లో చివరి వన్డే మ్యాచ్ కూడా దక్షిణాఫ్రికా తరఫున ఆడాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడ్డాడు.
కెప్లర్ వెస్సెల్స్ ODI ఫార్మాట్ లో 10 సంవత్సరాలు ఆడాడు. అంటే, ఆయన 1983లో తొలిసారి ఒక ODI మ్యాచ్ పోటీ ఆడితే, 1994లో లాస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆయన ఎక్కువగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించేవాడు. ఈ 10 సంవత్సరాలలో ఆయన 109 ODI మ్యాచ్ లు ఆడాడు. అందులో 105 సార్లు బ్యాటింగ్ చేశాడు. ప్రతి మ్యాచ్ లోనూ ఆయన స్కోర్ చేశాడు. ఆయన ODI కెరీర్ లో మొత్తం 3,367 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 26 అర్ధ శతకాలు ఉన్నాయి. ఆయన అత్యధిక స్కోర్ 107 పరుగులు. విశేషం ఏంటంటే, కెప్లర్ వెస్సెల్స్ రెండు దేశాలకు తరఫున టెస్ట్, ODI మ్యాచ్ లు ఆడిన కొద్దిమంది క్రికెటర్లలో ఒకరు.
కెప్లర్ వెస్సెల్స్ ODI మ్యాచ్ లతో పోలిస్తే టెస్ట్ క్రికెట్‌ను అంత ఎక్కువ కాలం ఆడలేదు. ఆయన 40 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి, మొత్తం 2,788 పరుగులు చేశారు. ఈ 40 మ్యాచ్‌లలో ఆయన 6 సెంచరీలు , 15 ఆఫ్‌ సెంచరీలు చేశాడు. టెస్ట్ క్రికెట్‌లో ఆయన అత్యధిక స్కోర్ 179 పరుగులు. ఈ స్కోర్‌ను ఆయన పాకిస్తాన్ జట్టుతో ఆడిన అడిలైడ్ టెస్ట్ మ్యాచ్‌లో 1983లో చేశారు. విశేషం ఏంటంటే, కెప్లర్ వెస్సెల్స్ తన తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే సెంచరీ చేశారు. అంతేకాకుండా, ఇంగ్లాండ్ జట్టుతో ఆడిన తన తొలి టెస్ట్ మ్యాచ్‌లో 162 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ODI

సంబంధిత వార్తలు: