టెన్నిస్‌లో టాప్ బ్యూటీ ప్లేయర్స్ వీరే

Suma Kallamadi
టెన్నిస్ ప్రపంచంలో మహిళలు దూసుకుపోతున్నారు. అందంతో పాటు అద్భుతమైన ఆటతో వారు ప్రత్యేక క్రేజ్‌ను ప్రపంచ వ్యాప్తంగా సొంతం చేసుకున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే ఉమెన్స్ టెన్సిస్ స్టార్స్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో ఉంటుంది. ప్రస్తుతం టెన్నిస్ ప్రపంచంలో అత్యంత అందమైన 5 మంది మహిళా క్రీడాకారిణుల్లో భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా కూడా ఉన్నారు. మరి ఆ అందమైన మహిళా టెన్నిస్ ప్లేయర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
టెన్నిస్ సర్కిల్‌లో బాగా పాపులర్ అయిన వారిలో యూజీనీ బౌచర్డ్ ఒకరు. ఈమె కెనడా స్టార్ టెన్నిస్ ప్లేయర్. ఐదేళ్లకే టెన్నిస్ ఆడటం మొదలుపెట్టి ఇప్పుడు స్టార్ ప్లేయర్‌గా కొనసాగుతున్నారు. యూజీనీ బౌచర్డ్ అందంలో అంత తక్కువేం కాదు. ఇన్‌స్టాగ్రామ్‌లో 2.3 మిలియన్ల మంది ఆమెను ఫాలో అవుతున్నారు. భారత మహిళా టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా కూడా అందంతోనే కాదు ఆటతో కూడా ఫ్యాన్స్‌ను కట్టిపడేస్తుంటారు. సోషల్ మీడియాలో సానియాకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 13.2 మిలియన్ల మంది ఆమెను ఫాలో అవుతున్నారు.
రష్యా టెన్నిస్ ప్లేయర్ అయిన మరియా షరపోవా అందానికి అందరూ ఫిదా అయిపోతారు. 2020లో ఆమె టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. షరపోవా ఐదుసార్లు గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను గెలుచుకున్నారు. ప్రపంచ మాజీ నంబర్ వన్ అయిన అన ఇవానోవిచ్ తనకు 29 ఏట రిటైర్ అయ్యింది. సెర్బియా స్టార్ అయిన అనా ఇవానోవిచ్ హాలీవుడ్ హీరోయిన్ లా కనిపిస్తుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుంటారు. ఆమెకు ఇన్‌స్టాలో 1.5 మిలియన్ల ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రష్యాకు చెందిన అన్నా కోర్నికోవా అందాన్ని చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అన్నా కోర్నికోవాను 1.9 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఆమె ఫోటోలు కూడా ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ కవర్ పేజీలో కనిపించాయి. ఆమెకు సినిమా ఆఫర్లు కూడా వచ్చాయని, అయితే వాటిని ఆమె రిజెక్ట్ చేసిందని నెటిజన్లు నెట్టింట కామెంట్స్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: