టీమిండియాకు గుడ్ న్యూస్.. గౌతమ్ గంభీర్ పంతం నెగ్గించుకున్నాడుగా..?

frame టీమిండియాకు గుడ్ న్యూస్.. గౌతమ్ గంభీర్ పంతం నెగ్గించుకున్నాడుగా..?

praveen
టీమిండియా కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తనకు కావలసిన వారిని నాకు కావాల్సిన పొజిషన్‌లో నియమించుకుంటున్నాడు. ప్రతి ఒక్క చోటా తన మాట నెగ్గాలని పట్టుబడుతున్నాడు మరోసారి అతను తన పంతం నెగ్గించుకున్నాడు. దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ మోర్నే మోర్కెల్ విషయంలో అతడి మాటనే ఎవరికి బీసీసీఐ అంగీకరించింది. మోర్నే మోర్కెల్ సెప్టెంబర్ 1 నుంచి భారత పురుషుల క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా నియమితులయ్యారు. సెప్టెంబర్ 19న బంగ్లాదేశ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ అతని మొదటి టాస్క్. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో మోర్కెల్ తిరిగి కలుసుకున్నాడు. ఇతను గంభీర్‌కు మాజీ IPL సహచరుడు.
భారత క్రికెట్ జట్టుకు కొత్త బౌలింగ్ కోచ్‌గా మోర్నే మోర్కెల్‌ను నియమించామని బీసీసీఐ సెక్రటరీ జై షా చెప్పారు. ఇండియన్ జట్టుకు గంభీర్‌ను హెడ్ కోచ్‌గా నియమించినప్పటి నుంచి మోర్కెల్‌ను కోచ్‌గా నియమిస్తారనే వార్తలు చాలా కాలంగా వస్తున్నాయి. మోర్కెల్ ఇప్పుడు పరస్ మహంబ్రే స్థానంలో బౌలింగ్ కోచ్‌గా వచ్చాడు. దాదాపు పది సంవత్సరాల తర్వాత భారత క్రికెట్ బోర్డు మళ్ళీ విదేశీ కోచ్‌ను తీసుకుంది. దీనికి ముందు డంకన్ ఫ్లెచర్ భారత జట్టుకు కోచ్‌గా ఉండేవారు.
మోర్కెల్ గతంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు కూడా కోచ్‌గా ఉన్నారు. 2023లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో బాబర్ ఆజమ్ నాయకత్వంలోని పాకిస్తాన్ జట్టుకు ఆయన కోచ్‌గా వ్యవహరించారు. అయితే, ఆయన అగ్రిమెంట్ ముగియడానికి కొన్ని నెలల ముందే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో విడిపోయారు. మోర్కెల్ కోచ్‌గా ఉన్నప్పుడు పాకిస్తాన్ జట్టు సెమీ ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. పాయింట్స్ టేబుల్‌లో ఆరవ స్థానంలో నిలిచింది. ఇక, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోని లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు గంభీర్‌తో కలిసి మోర్కెల్ కోచ్‌గా ఉన్నారు.
గౌతమ్ గంభీర్ రెండేళ్ల క్రితం లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా తన బాధ్యతలను విడిచిపెట్టగా, మోర్నే మోర్కెల్ బౌలింగ్ కోచ్‌గా కొనసాగాడు. మోర్కెల్ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్‌తో సహకరించాడు. మయాంక్ యాదవ్ వంటి యువ ప్రతిభను అభివృద్ధి చేయడంలో సహాయం చేశాడు. అతను నమీబియా, డర్బన్ సూపర్ జెయింట్స్, న్యూజిలాండ్ మహిళల జట్టుకు కూడా కోచ్‌గా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: