వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్ క్రికెట్‌.. ఫైన‌ల్స్ రేసులో ఎవరంటే..?

frame వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్ క్రికెట్‌.. ఫైన‌ల్స్ రేసులో ఎవరంటే..?

RAMAKRISHNA S.S.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ క్రికెట్ టోర్నమెంట్ రసవత్తరంగా సాగుతోంది. తాజాగా వెస్టిండీస్ - దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత పాయింట్లు పట్టిక ఎలా ఉంది ? ఫైనల్స్ రేసులో ఎవరెవరు ? ఉన్నారో చూద్దాం. వెస్టిండీస్ - దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ ముగియడంతో పాయింట్ల పట్టికలో పెద్దగా మార్పులు ఏమీ లేవు. వెస్టిండీస్ 9 వ‌ స్థానంలో ఉంటే ... దక్షిణాఫ్రికా ఏడవ స్థానంలో కొనసాగుతోంది. ఇక ఇప్పటివరకు 9 మ్యాచులు ఆడి ఆరు విజయాలు సాధించిన భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.

ఆ తర్వాత రెండో స్థానంలో ఆస్ట్రేలియా కొనసాగుతోంది. ఇక ఆస్ట్రేలియా తర్వాత వరుసగా న్యూజిలాండ్ - శ్రీలంక - పాకిస్తాన్ - ఇంగ్లాండ్ - దక్షిణాఫ్రికా - బంగ్లాదేశ్ - వెస్టిండీస్ ఆ తర్వాత స్థానాలలో కొనసాగుతున్నాయి. ఇక ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం చూస్తే భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ క్రికెట్ ఫైనల్ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక ఫైనల్ రేసు లో భారత్ చాలా ముందు ఉందనే చెప్పాలి. ఎందుకంటే భారత్‌ ఇప్పటివరకు 9 మ్యాచులు ఆడి 68 పాయింట్లు సాధిస్తే ... 12 మ్యాచ్‌లు ఆడిన ఆస్ట్రేలియా 62 పాయింట్లు సాధించింది.

ఇక మూడో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ 50 పాయింట్లు సాధిస్తే ... నాలుగో స్థానంలో ఉన్న శ్రీలంక సైతం 50 పాయింట్లు సాధించి పాయింట్లు పట్టికలో టాప్ ఫోర్ ప్లేస్లో కొనసాగుతుంది. మరి ఏమైనా అంచనాలు తలకిందులు అయితే తప్ప ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ భారత్ - ఆస్ట్రేలియా జట్ల‌ మధ్య జరగటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఒకసారి న్యూజిలాండ్ చేతిలో మరోసారి ఆస్ట్రేలియా చేతిలో ఫైనల్ కి వెళ్లి ఓడిపోయిన భారత్ మరి ఈసారైనా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ కిరీటాన్ని సాధిస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: