సిరాజ్, నిఖత్ జరీన్ కు ప్రభుత్వ ఉద్యోగాలు :?

frame సిరాజ్, నిఖత్ జరీన్ కు ప్రభుత్వ ఉద్యోగాలు :?

Veldandi Saikiran
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్, ప్రముఖ బాక్సర్ జరీన్ క్రీడాకారుల ఇద్దరికీ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాదిరిపోయే శుభవార్త చెప్పింది.  బాక్సర్  నిక్కత్ అలాగే మహమ్మద్ సిరాజులకు.. ఆర్థిక సహాయంతో పాటు ఇంటి స్థలం కూడా కేటాయించబోతున్నట్లు తెలిపారు రేవంత్ రెడ్డి. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్  గ్రూప్ వన్ ఉద్యోగం ఇస్తున్నట్లు తెలిపారు.

మహమ్మద్ సిరాజుకు విద్యార్హత లేకున్నా... గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వడం జరుగుతోందని తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక.. బాక్సర్  నిక్కత్ కు  కూడా గ్రూప్ వన్ ఉద్యోగం ఇస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా రాబోతుందని వివరించారు. ఇందుకోసం హర్యానా క్రీడా విధానాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు రేవంత్ రెడ్డి.

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని వివరించారు. ఇక ముఖ్యంగా హైదరాబాద్లో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కట్టబోతున్నట్లు తెలిపారు.  గచ్చిబౌలి, సరూర్నగర్ అలాగ యూసఫ్ గూడా లాంటి స్టేడియాలలో క్రీడలు పూర్తిగా తగ్గిపోయాయని తెలిపారు. ఎల్బీనగర్ స్టేడియంలో రాజకీయ మీటింగ్లు తప్ప.... క్రీడాలు ఆడడం.. ఫైర్ అయ్యారు.

వచ్చే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో క్రీడాలకు సంబంధించిన పాలసీ కూడా ఉంటుందని వివరించారు. దీనిపై ప్రతిపక్షాల సలహాలు అలాగే సూచనలను కచ్చితంగా తీసుకుంటామని  వెల్లడించారు.  విద్యార్థులకు క్రీడాలపై ఆసక్తి పెరిగేలా చూస్తామని వివరించారు. ఎవరు దీని  పై ఆందోళన చెందాల్సిన పని లేదని కూడా వెల్లడించారు. పంజాబ్ తరహాలో కొత్త పాలసీ తెస్తామన్న రేవంత్‌.. స్పోర్ట్స్ స్టేడియాలు కూడా ఏర్పాటు చేస్తామని వివరణ ఇచ్చారు. భూమి అందుబాటులో ఉంటే మాకు నిధుల విడుదలకు ఇబ్బంది లే దని తెలిపారు సీఎం రేవంత్‌రెడ్డి. బీసీసీఐతో కూడా మాట్లాడుతున్నాం.. నేషనల్ అకాడమీ పెట్టాలని అనుకుంటున్నామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: