రాహుల్ vs పంత్.. జట్టులో చోటు ఎవరికి.. రోహిత్ ఏమన్నాడంటే?

frame రాహుల్ vs పంత్.. జట్టులో చోటు ఎవరికి.. రోహిత్ ఏమన్నాడంటే?

praveen
ప్రస్తుతం భారత జట్టు శ్రీలంక పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా మూడు ఫార్మాట్లలో కూడా సిరీస్ ఆడుతుంది. అయితే మొన్నటికి మొన్న సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీ లో బరిలోకి దిగిన టీమిండియా.. ఇక టి20 ఫార్మాట్లో సిరీస్ ను కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్ల సిరీస్ ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది. అటు శ్రీలంక జట్టును వారి సొంత గడ్డపైనే క్లీన్ స్వీప్ చేసింది అన్న విషయం తెలిసిందే  కాగా నేడు కెప్టెన్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలు జట్టులో చేరడంతో ఇక టీమిండియా మరింత పట్టుదలతో సిరీస్ ను గెలుచుకోవాలని అనుకుంటుంది.

 అయితే తుది జట్టులో ఎవరికి చోటుదక్క పోతుంది అనే విషయంపై మాత్రం ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది అని చెప్పాలి. ఎందుకంటే అటు వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో ఇద్దరు వికెట్ కీపర్ లు ఉండడమే ఇందుకు కారణం. కేఎల్ రాహుల్, రిషబ్ పంతులు వికెట్ కీపర్ లుగా కొనసాగుతున్నారు. దీంతో ఇక భారత సెలెక్టర్లు ఎవరికి తుది టీమ్ ఇండియాలో ఛాన్స్ ఇవ్వబోతున్నారు అనే విషయం గురించి అందరూ చర్చించుకుంటున్నారు అని చెప్పాలి. అయితే ఇటీవలే నిర్వహించిన మీడియా సమావేశంలో కెప్టెన్ రోహిత్ కి కూడా ఇదే విషయంపై ప్రశ్న ఎదురయింది. ఈ క్రమంలోనే ఆసక్తికర సమాధానం చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ.

 శ్రీలంకతో నేటి నుంచి జరగబోయే వన్డే సిరీస్ లో వికెట్ కీపర్ గా ఎవరిని ఆడించాలి అనే విషయంపై ఇంక నిర్ణయించలేదు అంటూ చెప్పుకొచ్చాడు. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ ఇద్దరు క్వాలిటీ ప్లేయర్స్. మ్యాచ్ విన్నెర్స్ కూడా. టీం లో క్వాలిటీ ఉంది. కాబట్టి సెలక్షన్ గురించి బయట చర్చ జరుగుతుంది. జట్టులో మంచి ప్లేయర్లు ఉన్నారు. ఇలాంటి అప్పుడు తుది జట్టు ఎంపిక కూడా కష్టం అవుతుంది అంటూ రోహిత్ ఇక ఈ విషయాన్ని సస్పెన్స్ లో పెట్టేసాడు. దీంతో ఇక ఎవరికి జట్టుల చోటు దక్క పోతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: