ఎన్నో రోజులు బాధపడ్డా.. అది హార్ట్ బ్రేకింగ్ మూమెంట్ : ధోని
అయితే గత కొన్ని వరల్డ్ కప్ ల నుంచి కూడా టీమ్ ఇండియా వరల్డ్ కప్ గెలిచినంత పని చేసింది. కానీ చివర్లో తడబడి చివరికి ఇక అభిమానులను నిరాశపరిచింది. మరీ ముఖ్యంగా 2019 వరల్డ్ వరల్డ్ కప్ లో అటు న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ధోని రన్ అవుట్ అయిన ఘటనను ఎప్పటికీ భారత క్రికెట్ ప్రేక్షకులు మరిచిపోలేరు. ఈ రన్ అవుట్ ఘటన భారత క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ కూడా హార్ట్ బ్రేకింగ్ అని చెప్పాలి. ఇక ఎంతోమంది ప్రేక్షకులు కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఇలా భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా వద్దన్నా గుర్తుకు వచ్చే ఒక చేదు జ్ఞాపకంగా ఇలా సెమీఫైనల్ లో ధోని రన్ అవుట్ మిగిలిపోయింది.
అయితే ఈ రన్ అవుట్ పై తాజాగా మిస్టర్ కూల్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని స్పందించారు. తన చివరి వరల్డ్ కప్ లో అలాంటి ముగింపు తనను ఎంతగానో బాధకి గురిచేసింది అంటూ మహేంద్రసింగ్ ధోని చెప్పుకొచ్చాడు. అది నిజంగా హార్ట్ బ్రేకింగ్ మూమెంట్.. దాని నుంచి బయటపడేందుకు చాలా సమయం పట్టింది అంటూ మహేంద్రుడు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. అటు వెంటనే ఇక క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడం అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉండడంతో.. చివరికి ఆ ఘటన ఇచ్చిన బాధ నుంచి బయట పడేందుకు సమయం దొరికింది అంటూ చెప్పుకొచ్చాడు ధోని. అయితే ఇలా రన్ అవుట్ అయిన తర్వాత డగౌట్ చేరుకుంటున్న సమయంలో ధోని కన్నీళ్లు పెట్టుకున్నా ఘటన అభిమానులను సైతం కన్నీళ్లు పెట్టించింది.