టీమ్ ఇండియాకు షాక్.. వైస్ కెప్టెన్ దూరం?
అయితే ఇక ఇప్పుడు ద్వైపాక్షిక సిరీస్ లతో బిజీబిజీగా ఉంది. టీమ్ ఇండియా అటు శ్రీలంక పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ పర్యటనలో భాగంగా మూడు ఫార్మాట్ లలో కూడా సిరీస్ ఆడిపోతుంది. ఇక ఇప్పటికే t20 సిరీస్ ప్రారంభమైంది. కొత్త కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలో టీమిండియా టి20 సిరీస్‌లో బరిలోకి దిగింది అని చెప్పాలి. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు పూర్తిగా కాగా రెండు మ్యాచ్ లలో కూడా అదరగొట్టేసింది. ఏకంగా రెండు మ్యాచ్ లలో విజయం సాధించి 2-0 తేడాతో పూర్తి ఆదిపత్యాన్ని ప్రదర్శించింది. కాగా నేడు మూడో టి20 మ్యాచ్ ఆడెందుకు సిద్ధమైంది టీం ఇండియా.
కాగా నేడు జరగబోయే మూడో టి20 మ్యాచ్ లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని అనుకుంటుంది. అదే సమయంలో సిరీస్ ను క్లీన్‌స్వీప్ చేసి ఇక శ్రీలంక జట్టుకు సొంత దేశంలోనే షాక్ ఇవ్వాలని చూస్తుంది సూర్య కుమార్ సేన. ఇలాంటి సమయంలో అటు టీం ఇండియాకు మాత్రం బిగ్ షాక్ తగిలింది. ఎందుకంటే నేడు శ్రీలంకతో జరగబోయే మూడో టి20 మ్యాచ్ కు టీమిండియా వైస్ కెప్టెన్ గిల్ దూరం కాబోతున్నట్లు తెలుస్తోంది. మెడ కండరాలు పట్టేయడంతో మ్యాచ్ ఆడడని సమాచారం. ఇదే కారణంతో రెండో టీ20 మ్యాచ్ లో గిల్ ఆడలేదు. దీంతో సంజుకి తుది జట్టులో చోటు దక్కింది. అయితే పూర్తిగా విఫలమవుతున్న సిరాజ్ స్థానంలో ఖలీల్ అహ్మద్‌ను తుది జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది అన్నది తెలుస్తుంది.