కోహ్లీ, బుమ్రా కాదు.. టీమిండియాకు అతనే ఎక్స్ ఫాక్టర్ : మాజీ కోచ్
సాధారణంగా టెస్ట్ ఫార్మాట్లో టీమ్ ఇండియాలో అత్యుత్తమ ప్లేయర్లు ఎవరు అంటే ముందుగా విరాట్ కోహ్లీ పేరు వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అతను ఇక సాంప్రదాయమైన టెస్ట్ క్రికెట్ ఫార్మాట్లో సాధించిన రికార్డులు అలాంటివి. మరి బౌలర్లలో ఎవరు అంటే ముందుగా వినిపించే పేరు బుమ్రా. ఎందుకంటే పరిమిత ఓవర్ల ఫార్మాట్లో మాత్రమే కాదు టెస్ట్ ఫార్మాట్లో కూడా తన బౌలింగ్ తో ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నాడు ఈ స్టార్ ఫేసర్. అయితే ఈ ఇద్దరు కాదు టెస్ట్ క్రికెట్లో భారత జట్టులో మరో అత్యుత్తమ ఆటగాడు ఉన్నాడు అంటూ భారత మాజీ హెడ్ కోచ్ లాల్చంద్ రాజ్ పుత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
అతను ఎవరో కాదు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా. హార్థిక్ పాండ్యా టీం ఇండియా ఎక్స్ ఫాక్టర్ అంటూ కొనియాడాడు లాల్చంద్. అతను టెస్ట్ క్రికెట్ ఆడితే టీమిండియా మరింత పట్టిష్టం అవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. హార్దిక్ టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇస్తే బ్యాటింగ్ ఫీల్డింగ్ బౌలింగ్ ఇలా మూడు విభాగాల్లో భారత జట్టు మరింత పటిష్టంగా మారుతుంది. మూడు విభాగాలను మ్యాచ్ స్వరూపాన్ని మార్చగలిగే సామర్థ్యం అతనికి ఉంది. రెడ్ బాల్ క్రికెట్ లో అతను రానిస్తే టీమిండియా కు తిరుగు ఉండదు. ఎందుకంటే అతను ఫాస్ట్ బౌలింగ్ చేయడంతో పాటు బ్యాటింగ్ కూడా చేయగలడు అంటూ లాల్ చందు చెప్పుకోచ్చాడు. 2018 లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అప్పటినుంచి ఫిట్నెస్ సమస్యలతో ఇక సుదీర్ఘమైన టెస్ట్ ఫార్మాట్ కి దూరంగానే ఉన్నాడు.