ఇండియా vs శ్రీలంక.. నేడే మొదటి మ్యాచ్.. ఎక్కడ చూడొచ్చంటే?

praveen
భారత క్రికెట్ లో టి20 ఫార్మాట్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయ్. మొన్నటి వరకు భారత జట్టు టి20 ఫార్మాట్లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో బరిలోకి దిగింది. మొన్నటికి మొన్న ఏకంగా వరల్డ్ కప్ టోర్నీలో టైటిల్ విజేతగా కూడా నిలిచింది. అదే సమయంలో హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడు వ్యవహరించేవాడు. కాగా ఇటీవల వరల్డ్ కప్ గెలిచిన వెంటనే రోహిత్ శర్మ టి20 ఫార్మాట్ కు గుడ్ బై చెప్పేయడం.. రాహుల్ ద్రావిడ్ కోచ్ పదవీకాలం ముగియడంతో ఇక ఇప్పుడు కొత్త కోచ్ కొత్త కెప్టెన్ తో భారత జట్టు బరులోకి దిగేందుకు సిద్ధమవుతుంది.

 ఈ క్రమంలోనే కొత్త కెప్టెన్ గా అటు సూర్య కుమార్ యాదవ్కు బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ. అయితే హార్దిక్ పాండ్యాకు ఇలా టి20 కెప్టెన్సీ దక్కుతుంది అని అందరూ అనుకున్నప్పటికీ.. అలా జరగలేదు. కనీసం అతనికి వైస్ కెప్టెన్సీ కూడా ఇవ్వలేదు. ఇక సూర్యకుమార్ను కెప్టెన్ గా ప్రకటించగా చేతికి వైస్ కెప్టెన్సీ దక్కింది. సూర్య కుమార్ యాదవ్ ప్రస్తుతం రెగ్యులర్ కెప్టెన్గా టీమిండియాను ఎలా ముందుకు నడిపించబోతున్నాడు అనే విషయం కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

 అయితే ప్రస్తుతం భారత జట్టు శ్రీలంక పర్యటనలో ఉండగా ఇక మూడు ఫార్మాట్లలో కూడా సిరీస్ లు ఆడబోతుంది. కాగా నేటి నుంచి టి20 సిరీస్ ప్రారంభం కాబోతుంది. రెగ్యులర్ కెప్టెన్ గా సూర్య మొదటి మ్యాచ్ లో జట్టును ముందుకు నడిపించబోతున్నాడు. ఇక కొత్త కోచ్ గంభీర్ నేతృత్వంలో ఈ మ్యాచ్ జరగబోతుంది. కాగా నేడు సాయంత్రం ఏడు గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది అని చెప్పాలి. సోనీ చానల్స్ లో లైవ్ ప్రసారం కానుంది. ఇండియా తుది జట్టులో జైష్వాల్, గిల్, పంత్, సూర్య,హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, హర్షదీప్, సిరాజ్ పేర్లు లాంచనంగానే కనిపిస్తుంది. ఇక మిగిలిన రెండు స్థానాలలో వాషింగ్టన్ సుందర్, భిష్నోయ్, ఖలీల్ లలో ఇద్దరికీ ఛాన్స్ దొరికే అవకాశం ఉంది. మరి సూర్య కుమార్ తన కెప్టెన్సీ తో మ్యాజిక్ చేస్తాడా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: